Asianet News TeluguAsianet News Telugu

విరూపాక్ష టీంకి యంగ్ హీరో గ్రాండ్ పార్టీ..అట్లుంటది టిల్లుతోని..

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.యువ దర్శకుడు కార్తీక్ దండు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.

Siddhu Jonnalagadda party to Virupaksha movie team dtr
Author
First Published Apr 30, 2023, 5:39 PM IST

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.యువ దర్శకుడు కార్తీక్ దండు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కార్తీక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసిన చిత్రంతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ మీద కూర్చుని ఎంజాయ్ చేసేలా విరూపాక్ష చిత్రాన్ని తీర్చిదిద్దారు.  

ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తేజుకి ఈ చిత్రంతో గ్రాండ్ వెల్కమ్ లభించింది. త్వరలో విరూపాక్ష చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. విరూపాక్ష గ్రాండ్ సక్సెస్ కావడంతో టాలీవుడ్ నుంచి విరూపాక్ష టీంకి ప్రశంసలు దక్కుతున్నాయి. 

Siddhu Jonnalagadda party to Virupaksha movie team dtr

అయితే యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ విరూపాక్ష టీంని సర్ప్రైజ్ చేశారు. టిల్లుగాని పార్టీ ఎట్లుంటదో చూపించారు. హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు లకు డీజే టిల్లు హీరో డిన్నర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పిక్ ని సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

విరూపాక్ష చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా టీంకి నా శుభాకాంక్షలు.. పాన్ ఇండియా రిలీజ్ కి కూడా ఆల్ ది బెస్ట్ అని సిద్దు జొన్నలగడ్డ తెలిపారు. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios