Asianet News TeluguAsianet News Telugu

టైటిల్ మార్చి పోస్టర్,ఓ బూతు పదం కూడా ..కారణం?

సితార ఎంటర్టైన్‌మెంట్స్   సిద్దు జొన్నలగడ్డ  హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 

Siddhu Jonnalagadda in and as DJ Tillu
Author
Hyderabad, First Published Aug 26, 2021, 11:29 AM IST

టైటిల్ అనేది సినిమా విజయంలో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయం తెలిసిందే. దాంతో టైటిల్ ని ఆచి,తూచి పెడుతూంటారు. యూత్ కు పట్టాలి, సినిమాపై ఆసక్తి రేపాలి, జనాల్లోకి బాగా వెళ్లే పదాలు ఉండాలి వంవివి టైటిల్ నిర్ణయం లో దృష్టిలో పెట్టుకుంటారు. అందుకే సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేదాకా టైటిల్ విషయమై మల్లగుల్లాలు పడుతూంటారు. ఒక్కోసారి పెట్టిన టైటిల్ నే మార్చేస్తూంటారు. తాజాగా అలాంటి టైటిల్ ఛేంజే ..సిద్దు జొన్నలగడ్డ సినిమాకు జరిగింది.

వివరాల్లోకి వెళితే...'గుంటూరు టాకీస్' ,'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఓ చిత్రం చేస్తున్నారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో హీరోయిన్‌గా నేహాశెట్టి నటిస్తోంది. ఈ చిత్రానికి  'నరుడి బ్రతుకు నటన'  అనే టైటిల్ పెట్టారు. అయితే ఇప్పుడు టైటిల్ మార్చి పోస్టర్ వదిలారు.

ఈ చిత్రానికి పెట్టిన కొత్త టైటిల్  ''డీజే టిల్లు''. తాజాగా వదిలిన పోస్టర్ లో ఓ కారు బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్ మీద టైటిల్ డిజైన్ చేయబడి ఉంది. 'అట్లుంటది మనతోని' అనేది దీనికి ట్యాగ్ లైన్. కారు మీద 'హిట్టింగ్ టు గివ్ ఎ F*ck' 'సారీ ఆఫీసర్.. మీరు రేసు కోరుకున్నారని అనుకున్నాను' వంటి లైన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో సిద్ధు రాక్ స్టార్ డీజే టిల్లు గా కనిపించనున్నారు. అయితే ఈ టైటిల్ మార్పు ఎందుకు చేసారనేది మాత్రం తెలియరావటం లేదు. కొంతమంది సినిమాకు యూత్ అప్పీల్ రావటం కోసం టైటిల్ మార్చారంటున్నారు. అదేమీ కాదు...మొదట అనుకున్న టైటిల్ వేరే వారి దగ్గర ఉందని ఇలా టైటిల్ మార్చారని మరికొందరంటున్నారు. ఏది నిజం అనేది తెలియరాలేదు.

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు.  ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

''డీజే టిల్లు'' చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి స్టోరీ - స్క్రీన్ ప్లే దర్శక హీరోలు ఇద్దరూ కలిసి అందిస్తున్నారు. డైలాగ్స్ కూడా సిద్ధు జొన్నలగడ్డ రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ - రవివాట్6 యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార బ్యానర్ లో రూపొందే మలయాళ సూపర్ హిట్ 'కప్పెల' రీమేక్ లో కూడా సిద్ధు హీరోగా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios