Asianet News TeluguAsianet News Telugu

టిల్లు హీరో కోసం త్యాగం చేసిన నితిన్.. ఏకంగా ఆ సినిమానే వదిలేశాడు తెలుసా..

గతంలో చాలా మంది హీరోలు వదులుకున్న చిత్రాలు మరో హీరో చేతిలోకి వెళ్లడం చూశాం. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. 

Siddhu Jonnalagadda doing movie with Nithiin Story dtr
Author
First Published Dec 6, 2023, 10:04 AM IST

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నితిన్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా కంప్లీట్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రం నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ పెంచుతూనే ఉంది. ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఫన్నీ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు కూడా సినిమాకి మంచి మైలేజి తెచ్చిపెట్టాయి. ఇక సిల్వర్ స్క్రీన్ పై నితిన్, వక్కంతం వంశీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. 

నితిన్ తాజా ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయం రివీల్ చేశాడు. ఇప్పుడు కొత్తగా జరిగిన విషయం కాదుకానీ టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేదే. గతంలో చాలా మంది హీరోలు వదులుకున్న చిత్రాలు మరో హీరో చేతిలోకి వెళ్లడం చూశాం. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. 

అయితే తన వద్దకు వచ్చిన ఒక ప్రాజెక్టు విషయంలో నితిన్ జెన్యూన్ గా వ్యవహరించాడు. కథ నచ్చకపోతే ఏ హీరో అయినా రిజెక్ట్ చేయడం కామన్. కానీ నితిన్ వెరైటీగా స్పందించాడు. ఇటీవల టిల్లు హీరో సిద్దు జొన్నల గడ్డ, శ్రీనిధి శెట్టి కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుసు కదా అనే టైటిల్ తో చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. 

ఈ చిత్రానికి నీరజ కోనా దర్శకత్వం వహిస్తున్నారు. మాచర్ల షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు ఈ కథని నీరజ కోనా ముందుగా నితిన్ కే చెప్పారట. నితిన్ తో సినిమా చేయాలనే ఆ కథతో నీరజ కోన వెళ్లారు. కథ చాలా బావుంది అని కూడా నితిన్ అన్నారు. కానీ ఈ కథ నా కంటే సిద్దు జొన్నలగడ్డకి బాగా సూట్ అవుతుందని నితిన్ సలహా ఇచ్చారట. 

ఆ రోజు రాత్రే పదిన్నరకు నితిన్ సిద్దుకి ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పారట. ఆ తర్వాత సిద్దు కథ వినడం, ప్రాజెక్టు ఒకే కావడం జరిగింది. అదన్నమాట టిల్లు హీరో కోసం నితిన్ చేసిన త్యాగం. నితిన్.. సిద్ధుకి ఒక ప్రాజెక్టు అయితే సెట్ చేసాడు కానీ ఆ చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios