#Balakrishna:'మైత్రీ' లో బాలయ్యతో పీరియడ్ డ్రామా, డైరక్టర్ ఎవరంటే...

ఈ సినిమా తర్వాత బాలయ్య ఓ పీరియడ్ డ్రామా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు రాహుల్ సాంకృత్యన్.

Shyam Singha Roy Director next Period Drama with Balakrishna jsp


సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ కు ఉన్న డిమాండ్ మరో హీరోకు లేరు. ఆయన వరసపెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూండంతో ఆయనకు విపరీతమైన డిమాండ్ ఉంది.   తన రెమ్యునరేషన్ ని పెంచిన కూడా నిర్మాతలు వెనకాడటం లేదు.  ఈ క్రమంలో తనను సంప్రదించే నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు తీసుకుంటూ కథలు వింటున్నారు. ఇప్పుడు బాలయ్య...లాస్ట్ ఇయిర్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య ఇచ్చిన దర్శకుడు బాబీతో సినిమా  చేస్తున్నాడు.ఈ సినిమా ఈ ఈ సంవత్సరం విడుదలవుతుంది. పవర్ ఫుల్  యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఓ పీరియడ్ డ్రామా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు రాహుల్ సాంకృత్యన్.

 నాని, సాయి పల్లవి జంటగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిలిం “శ్యామ్ సింగ రాయ్” కు డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్.   రాహుల్ సాంకృత్యన్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న  సమాచారం మేరకు ఇటీవల రాహుల్.. బాలయ్యను కలసి ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది కూడా ఓ పిరియాడిక్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్యని  పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకు రమ్మని చెప్పారని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. బాలయ్య పూర్తి  కథ ఓకే చేయగానే...ఎనౌన్సమెంట్ వస్తుంది.

ఇదిలా ఉంటే సంక్రాంతికి సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టిన హనుమాన్  దర్శకుడు ప్రశాంత్ వర్మతోనూ ఓ ప్రాజెక్టు బాలయ్య చేయనున్నారు. గత సంవత్సరం నుండి ఈ ప్రాజెక్టు నలుగుతోంది. అయితే  ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. అలాగే మరో దర్శకుడు అనీల్ రావిపూడి, బాలయ్యలతో ఆల్రెడీ ఓ చిత్రం వచ్చింది. మరో చిత్రానికి రంగం సిద్దం చేస్తున్నారు. బోయపాటి శ్రీను సైతం బాలయ్య కోసం ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారు. అది మరేదో కాదు “అఖండ 2″అని త్వరలోనే  సెట్స్ పైకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది.ఇలా వరసపెట్టి బాలయ్య సినిమా కథలు వింటూ లైనప్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios