'కొత్తబంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. 

'కొత్తబంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ హీరోయిన్ గా సరైన గుర్తింపుని మాత్రం సంపాదించలేకపోయింది.

ఆ మధ్యన వ్యభిచారం చేస్తూ పట్టుబడి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం టీవీ సీరియళ్ళలో నటిస్తూ బిజీగా నటిస్తున్న శ్వేతా బసు కొన్నాళ్లుగా ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో ప్రేమాయణం నడిపిస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

డిసంబర్ 13న పూణేలో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తరువాత వారంలో ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. 

ప్రస్తుతం శ్వేతా తనకు కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్ పార్టీ జరుపుకుంటున్నారు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

View post on Instagram
View post on Instagram