కరోనా భయాలు పక్కన పెట్టి ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం సినిమాల రిలీజ్ లో బిజీగా ఉంది. భీమ్లా నాయక్, వలిమై లాంటి చిత్రాలు సాలిడ్ ఓపెనింగ్స్ రాబడుతుండగా ఇండస్ట్రీ మొత్తం ఫుల్ జోష్ లో ఉంది.
కరోనా భయాలు పక్కన పెట్టి ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం సినిమాల రిలీజ్ లో బిజీగా ఉంది. భీమ్లా నాయక్, వలిమై లాంటి చిత్రాలు సాలిడ్ ఓపెనింగ్స్ రాబడుతుండగా ఇండస్ట్రీ మొత్తం ఫుల్ జోష్ లో ఉంది. రాబోవు రోజుల్లో మరిన్ని భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కరోనాకి గురి కావడం షాకింగ్ గా మారింది.
తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు శృతి హాసన్ కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో ప్రకటించింది. 'హాయ్ ఎవిరి వన్.. సంతోషించాల్సిన అప్డేట్ కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం నేను చికిత్స పొందుతున్నాను. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని ఆశిస్తున్నాను' అంటూ శృతి హాసన్ పేర్కొంది.
కొన్నివారాల క్రితం శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కూడా కోవిడ్ కి గురైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత కమల్ కోలుకున్నారు. ఇప్పుడు శృతి హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో టాప్ ఫామ్ లో ఉంది.
గత ఏడాది శృతి.. వకీల్ సాబ్, క్రాక్ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ బాలకృష్ణ, గోపి చంద్ మలినేని మూవీలో.. అలాగే ప్రభాస్ సలార్ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రస్తుతం శాంతను అనే వ్యక్తితో ఎఫైర్ సాగిస్తోంది. త్వరలో వీరిద్దరో వివాహం చేసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
