ఉందిలే మంచికాలం ముందుముందునా అన్నట్లు శ్రుతి హాసన్ కి భవిష్యత్ పై ఆశలు చిగురిస్తున్నాయి. కెరీర్ ముగిసింది ఇక చాప చుట్టేయడమే అనుకుంటున్న తరుణంలో క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది.
హీరోయిన్ గా శృతి హాసన్ (Shruti Haasan)ఆరంభం సరిగాలేదు. అన్నీ అట్టర్ ప్లాపులే. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ మూవీతో అమ్మడు దశ తిరిగింది. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శృతి హాసన్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. గబ్బర్ సింగ్ తర్వాత శృతి టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోయిన్ అయ్యారు. బలుపు, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్స్ ఖాతాలో పడ్డాయి. నంబర్ వన్ రేసులో ముందుకొచ్చిన శృతి హాసన్ ప్రేమ మైకంలో కెరీర్ ని వదిలేసింది. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.
మైఖేల్-శృతి వివాహం చేసుకోవడం ఖాయమేనని అందరూ భావించారు. అనూహ్యంగా 2019లో మైఖేల్ ఆమెకు బ్రేకప్ చెప్పారు. 2017 నుండి 2020 వరకు దాదాపు మూడేళ్లు శృతి హాసన్ సినిమాలు చేయలేదు. అంతలా మైఖేల్ ని ఆమె ప్రేమించారు. మైఖేల్ తో ప్రేమ విఫలం కావడంతో శృతి మానసికంగా వేదన అనుభవించారు. దాని నుండి బయటపడడానికి లండన్ లో వరుస మ్యూజిక్ లైవ్ షోలు చేశారు. అనంతరం 2019 చివర్లో ఇండియాకు వచ్చింది.
అప్పటికి తెలుగు జనాలు శ్రుతిని మర్చిపోయారు. హిట్ లేక ఫార్మ్ కోల్పోయి అల్లాడుతున్న రవితేజ, దర్శకుడు గోపీచంద్ కి శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు హిట్ కావడంతో శృతి హాసన్ ని తీసుకున్నారు. ఇక ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరూ చేయకపోవడంతో వకీల్ సాబ్ మూవీలో క్యామియో రోల్ చేసే ఛాన్స్ ఆమెకు దక్కింది. క్రాక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం శ్రుతికి కలిసొచ్చింది. దాని ఫలితమే ప్రభాస్ సలార్ మూవీలో ఛాన్స్. సలార్ ఛాన్స్ శృతికి దక్కడం ఊహించని పరిమాణం.
ఫేడ్ అవుట్ అయ్యింది... ఇక చిన్నా చితక చిత్రాలు చేసుకోవడమే అనుకుంటున్న తరుణంలో అంతా మారిపోయింది. గోపీచంద్ మలినేని మరలా శ్రుతిని వదల్లేదు. అఖండ హిట్ తో జోరుమీదున్న బాలయ్య (Balakrishna)సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. తాజాగా చిరంజీవి(Chiranjeevi) మూవీలో ఛాన్స్ దక్కించుకొని మరో క్రేజీ ఆఫర్ ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్ (NTR), మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ శృతితో ఇకపై చేసే అవకాశం లేదు. అయినప్పటికీ కెరీర్ కనుమరుగవుతుందనుకున్న దశలో శృతి సీనియర్ స్టార్స్ సినిమాలో ఆఫర్స్ దక్కించుకొని భవిష్యత్ కి బాటలు వేసుకుంటుంది. మరో ఐదేళ్లు శృతి కెరీర్ కి ఢోకా లేదనిపిస్తుంది.
