సోషల్‌ మీడియాలో హేట్‌ కల్చర్‌పై, బైకాట్‌ కల్చర్‌ పై స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ స్పందించింది. పలు షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ సోషల్‌ మీడియాపై స్పందించారు. ఆది ఎలా తప్పు దారిలో వెళ్తుందో తెలిపారు. విద్వేషాలకు కేరాఫ్‌గా నిలుస్తుందంటూ ఆమె షాకింగ్‌ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, నష్టాలు కూడా అలానే ఉన్నాయి. ఇవి చాలా వరకు ట్రోల్స్ కి వేదికలుగా మారుతున్నాయి. సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్కువగా ట్రోల్స్ జరుగుతుంటాయి. బాలీవుడ్‌లో `బైకాట్‌` ట్యాగ్స్ తో ట్రెండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శృతి హాసన్‌ స్పందించింది. 

ఈ బైకాట్‌ లాంటిది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదని, చాలా రంగాల్లో ఉందని తెలిపింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది శృతి. దీనికి చాలా కారణాలున్నాయని, దీనిపై అందరు ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సినిమాలను బ్యాన్‌ చేయాలనే కల్చర్‌ ఓరకమైన బెదిరింపు చర్యగా, దాడి చేయడం లాంటిదే అని పేర్కొంది. అయితే దీన్ని మనం సినిమా ఇండస్ట్రీకి పరిమితమైందనిగానేమనం చూస్తున్నామని, అంతకు మించి సమాజంలో ఈ ఆన్‌లైన్‌ కల్చర్‌ చాలా ఉందని తెలిపింది. ఇది సమాజంలో ద్వేషాలు నింపేలా మారిందని వెల్లడించింది శృతి. 

అంతేకాదు తనకు ఎదురైన సంఘటన కూడా పంచుకుంది. తాను కూడా పర్సనల్‌గా ఇలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవల్సి వచ్చిందని చెప్పింది. తనని చుడైల్‌(మంత్రెగత్తె) అని పిలుస్తుంటారని, ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దాన్ని అధిగమిస్తామని తనకు తెలుసు అని, దీనిపై తన సొంతంగా ఆలోచిస్తానని తెలిపింది. ప్రస్తుతం శృతి చేసిన ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

శృతి హాసన్‌ నటిగా, సింగర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ కి ముందు ఆమె మ్యూజిక్‌ పై దృష్టి పెట్టింది. కానీ మళ్లీ సినిమాలపై ఫోకస్‌పెట్టింది. మ్యూజిక్‌కి బ్రేక్‌ ఇస్తూ సినిమాల్లో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఆమె భారీ చిత్రాల్లో భాగమవుతుంది. అందులో ప్రభాస్‌తో `సలార్`, చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాలున్నాయి. వచ్చే ఏడాదిలో దాదాపు మూడు సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయబోతుంది కమల్‌ తనయ.