Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకోకపోవడం అంత పెద్ద నేరమా..? శ్రుతీహాసన్ సూటి ప్రశ్న, అందుకే వారిని వదిలేసిదంట.

తన పెళ్ళి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ సీనియర్ హీరోయిన్ శృతీ హాసన్. తన పెళ్ళి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న వారికి సరైన సమాధానం చెప్పింది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 
 

Shruti Haasan Shocking Comments about Her Marriage Jms
Author
First Published Nov 2, 2023, 11:16 AM IST

తమిళంతో పాటు.. తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సాధించింది శ్రుతి హాసన్. మధ్యలో కెరీర్ ను నిర్లక్ష్యం చేసి.. ఫారెన్ లో ఎంజయ్ చేసిన బ్యూటీ.. మధ్య మధ్యలో మానసిక సమస్యలతో ఇబ్బంది పడింది. ఆతరువాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తూ.. వరుస ఆఫర్లు అందుకుంటోంది. 

ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్న పేరుతో తెచ్చుకున్న శృతీకి.. గబ్బర్ సింగ్ సినిమాతో లక్కీ అన్న ట్యాగ్ తగిలించాడు పవర్ స్టార పవన్ కళ్యాణ్. ఇక ఆతువాత ఆమె కెరీర్ దూసుకెళ్లింది. ప్రస్తుంతం 40 ఏళ్లకు దగ్గరగా ఉన్న శృతీ హాసన్  ఇంత  వరకు పెళ్ళి చేసుకోలేదు. గతంలో ఓ ఫారినర్ ను ప్రేమించి..పెళ్ళి కూడా చేసకోబోతుంది అనుకున్నారు.. అంతే కాదు.. తన ఫ్యామిలీ ఈవెంట్ లో కూడా అతనితో కనిపించింది బ్యూటీ. కాని ఆతరువాత అతనితో బ్రకప్ చెప్పి.. శాంతను అనే మరో వ్యక్తితో ప్రస్తుతం రిలేషన్ లో ఉంది బ్యూటీ. శాంతను తనను అర్ధం చేసుకుంటాడటి.. తనకు పరిస్థితికి తగ్గట్టుగా ఉంటాడని అంటుంది బ్యూటీ. 

ఇక తన పెళ్ళి గురించి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారని.. 30 దాటాక ఇంకా పెళ్ళి చేసుకోలేదని విమర్షలు కూడా విన్నానంటోంది బ్యూటీ. కాని ముప్ఫైఏళ్లు  దాటిటే పెళ్ళి చేసుకోవాలి అని రూల్ ఏమైనా ఉందా..? నా విషయానికి వస్తే.. 30 దాటాకా నాలో పరిపక్వత పెరిగింది. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అంటున్నది అందాలభామ శ్రుతిహాసన్‌. 

రీసెంట్ గా ఓ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతీ..  తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేనిప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. మనసు బాగుంటే మనిషి ఆటోమేటిగ్గా ప్రశాంతంగా ఉంటాడు. కొన్నాళ్లక్రితం వరకూ నా పెళ్లి విషయంలో లెక్కకుమించిన వెటకారాలను ఎదుర్కొన్నాను. నాకు ముప్పై ఏళ్లు దాటాయని నాకే గుర్తుచేసేవారు.నాకంటే నా పెళ్లి గురించి వీళ్లకే బాధ ఎక్కువ.

అయినా..  అసలు ముప్పైఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దానివల్ల దేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా? ఈ వ్యవహారంపై ఇదివరకూ చాలా ఒత్తిడికి లోనయ్యేదాన్ని.  అందుకే అసలు ఇలా విమర్షించేవారిని పట్టించుకోవడం మానేశాను.. అలా చేసిన అప్పటి నుంచీ..  నాకు ఆ బాధ తప్పింది.. హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. అన్నారు శ్రుతి హాసన్. 

 నన్ను బాధపెట్టి ఆనందించాలనుకునేవాళ్లకు ఇదే నేను వేసే శిక్ష. ఇంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు అంటూ చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్‌. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ జోడీగా పాన్ ఇండియ  ప్రాజెక్ట్ అయిన సలార్ లో నటిస్తోంది. ఈడిసెంబర్ 3న ఈమూవీ రిలీజ్ కాబోతోంది. ఈమధ్య వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో హిట్ అందుకుంది బ్యూటీ. 

Follow Us:
Download App:
  • android
  • ios