స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వెండి తెరపై కాస్త జోరు తగ్గించింది. తెలుగులో కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ మరో చిత్రంలో నటించలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని తమిళ చిత్రాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలో శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 

కాటమరాయుడు చిత్రం తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించింది. కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ కేవలం మ్యూజిక్ ఆల్బమ్స్ కి మాత్రమే పరిమితం అయింది. శృతి హాసన్ కాస్త బరువు కూడా పెరగడంతో అనేక రూమర్లు వినిపించాయి. ఆ సమయంలో తన మాజీ ప్రియుడు మైఖేల్ తో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్ గానే తిరిగింది. 

దీని గురించి శృతి హాసన్ మాట్లాడుతూ..' శృతి హాసన్ కు పెళ్లైపోయింది.. అందుకే లావైంది' అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ విని చాలా బాధపడ్డా. కానీ వాస్తవానికి నేను లావైంది అనారోగ్యం వల్ల. ఈ విషయం ప్రజలకు తెలియదు. కానీసం నా ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక కూడా నాకు ఆ సమయంలో లేదు అని శృతి హాసన్ తెలిపింది. 

ఇన్నాళ్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. నాకు ఇప్పుడు ప్రశాంతత కావాలి. విమర్శల్ని దాటుకుని వచ్చేశా. అవి నన్నిప్పుడు బాధించడం లేదు అని శృతి హాసన్ తెలిపింది. శృతి హాసన్, మైఖేల్ కొన్ని రోజుల క్రితమే విడిపోయారు. ఈ విషయాన్ని శృతి హాసన్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.