Asianet News TeluguAsianet News Telugu

పేరు శ్రియాఘోషల్ దే.. పాడింది మాత్రం ఆమె కాదట..

  • తెలుగు సినీ సంగీత రంగంలో మరో సంచలనం
  • పాడేది ఒకరు... పేరు మరొకరిది
  • ఫ్రీగా పాడమని సంగీత దర్శకులు, నిర్మాతలు అడుగుతున్నారంటున్న సింగర్ ప్రణవి
  • పాటకు 5వేలకు మిెచి ఇవ్వట్లేదని ఆరోపణ

 

shreya ghoshal name for other singer songs

గాయని ప్రణవి తెలుగులో మంచి మంచి పాటలే పాడింది. కొరియోగ్రాఫర్ రఘును పెళ్లి చేసుకున్న ఆమె ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఓ వెబ్ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. తనకు ఒక్కో పాటకు రూ.5 వేలకు మించి పారితోషకం ఇవ్వరని.. పాటకు మూడు వేలిచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. కొంచెం మీడియం రేంజి సినిమాల్లోనే పాడే ప్రణవికి మరీ ఇంత తక్కువ పారితోషకం ఇస్తున్నారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.



ఇక ప్రణవి పాడిన చాలా పాటలకు వేరే సింగర్స్ పేర్లు వేస్తుంటారట. అలా కొన్నిసార్లు బాలీవుడ్ స్టార్ సింగర్ శ్రియ ఘోషల్ పేరు కూడా వేశారని ఆమె చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన గాత్రం.. శ్రియ గాత్రానికి దగ్గరగా ఉంటుందని.. దీంతో తనతో పాట పాడించి.. దాన్ని మార్కెట్ చేసుకోవడానికి కొన్ని సందర్భాల్లో శ్రియ పేరు వేశారని ఆమె చెప్పింది. ఐతే ఇది తన అనుమతితోనే జరిగిందని.. అందుకు తానేమీ అభ్యంతర పెట్టలేదని.. కాకపోతే అలాంటి సందర్భాల్లో పారితోషకం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తానని ఆమె తెలిపింది.



ఓ పాటను గాయని చిత్రతో పాడించి.. ఆమె గొంతు హీరోయిన్ పాత్రకు సరిపోదని, దాన్ని పక్కనబెట్టి తనతో పాడించిన సందర్భం కూడా ఉందని.. ఇలా వేరే వాళ్ల పాటలు తనకు చాలానే వచ్చాయని.. అలా కాకుండా తన గొంతు సరిపోలేదని ఎప్పుడూ వేరే వాళ్లతో పాడించిన సందర్భాలు లేవని ప్రణవి చెప్పింది. ఐతే ప్రణవి పాటకు శ్రియ పేరు వేశారని అంటుంటేనే నమ్మశక్యంగా అనిపించట్లేదు. శ్రియ ఏ పాట పాడినా ఆమె గొంతును ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఈ ఇంటర్వ్యూ అంతటా కూడా ప్రణవి కొంచెం అతిశయోక్తి మాటలే చెప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో కెరీర్ ఆరంభంలో పాటకు ఐదు వేలంటే ఓకే ఏమో కానీ.. ఇప్పటికీ ఆమె ఐదు వేలకు పాట పాడుతోందంంటే నమ్మాలా.. ఏమో బాబూ.. ఈ మధ్య జనాలు చెప్తున్నదోటి..చేస్తున్నదోటి. జనాలకు సెన్సేషన్ కావాలి మరి.

Follow Us:
Download App:
  • android
  • ios