సాహో సినిమాతో ప్రభాస్‌కు జోడిగా  నటించిన శ్రద్ధా కపూర్‌ తాను శాఖాహరిగా మారిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంది. తాను గాయపడిన ఓ కాకిని కాపాడిన వీడియాతో పాటు తాను ప్రస్తుతం ఉపయోగిస్తున్న బాంబు టూత్‌ బ్రెష్‌, కాపర్‌ వాటర్‌ బాటిల్ లాంటి వాటిని కూడా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ మార్పులన్ని ప్రకృతిని కాపాడటం కోసమే అంటూ వివరించింది శ్రద్ధా కపూర్‌. గత ఏడాది తాను వెజిటేరియన్‌గా మారుతున్నట్టుగా ప్రకటించింది శ్రద్ధా.

ప్రకృతిని పరిరక్షించటం, ఉపయోగించటం లాంటి విషయంలో శ్రద్దా అభిమానులకు ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది. మనుషుల కారణంగా ప్రకృతిని ఎలాంటి వినాశనాన్ని ఎదుర్కొంటోంది, ఎలాంటి విద్వంసాలు జరుతున్నాయన్న విషయాలను కూడా అందరికీ అర్ధమయ్యే తెలిపే ప్రయత్నం చేస్తోంది శ్రద్ధా కపూర్‌. వెజిటేరియన్‌గా మారాలని తాను తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తనలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది.

వరల్డ్‌ నేచర్‌ కన్జర్వేషన్ డే సందర్భంగా తన సోషల్ మీడియా పేజ్‌లో కొన్ని ఆసక్తికర ఫోటోలను షేర్ చేసిన శ్రద్ధా కపూర్‌, అభిమానుల్లో ప్రకృతి రక్షణ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. శ్రద్దా ప్రకృతిని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుందంటున్నారు అభిమానులు. కేవలం చెప్పటమే కాదు తాను కూడా పాటిస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు.