బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ ఇటీవల 'సాహో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రీసెంట్ గా ఆమె నటించిన 'చిచ్చోరే' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. నటిగా శ్రద్దా కెరీర్ పీక్స్ లోనే ఉంది. ప్రస్తుతం ఆమె 'స్ట్రీట్ డాన్సర్', 'బాఘీ 3' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈమె ఓ రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారట. గత ఆరేళ్లుగా మానసిక ఆందోళన, వేదనతో పోరాడుతున్నానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో  చెప్పారు. ఆ సమస్యకు వ్యతిరేకంగా పోరాడదామంటే అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదని అన్నారు.

యాంగ్జైటీ అంటే ఏంటో తనకు తెలియదని.. గతంలో అసలు అర్ధమయ్యేది కాదని.. 'ఆషికీ 2' తర్వాత నుండి ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు.. దీనికి శారీరాక్ నిర్ధారణ లేదని.. మానసికంగా గుర్తించాలని తెలిపింది. మొదట చాలా వైద్య పరీక్షలు చేశారని.. కానీ వైద్యులు ఎటువంటి సమస్యను గుర్తించలేకపోయారని కానీ తనకు నొప్పి, బాధ ఎందుకు వచ్చేవో అర్ధమయ్యేది కాదని.. ఆ తరువాత తనను తనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టానని.. ఇప్పటికీ యాంగ్జైటీతో పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది.

కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పర్వాలేదని.. ఆ బాధను ద్వేషించి దూరం పెట్టాలని అనుకోవడం కంటే.. యాక్సెప్ట్ చేసి ప్రేమగా తగ్గించుకోవడం మంచిదని అప్పుడు సమస్య పరిష్కారంలో చాలా తేడా కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.