కెరీర్ మొదలైనప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా శ్రద్దా కపూర్  తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్న అమ్మడు ఈ ఏడాది షూటింగ్ లకు ప్యాకప్ చెప్పేసి పెళ్లి పనుల్లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. 

గత కొంత కాలంగా ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ఠతో ఈ బ్యూటీ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా శ్రద్దా పెద్దగా స్పందించలేదు. దీంతో బాలీవుడ్ మీడియా కూడా రూమర్స్ కి గట్టి బూస్ట్ ఇచ్చింది. ఫైనల్ గా బేబీ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోందట. 

33 ఏళ్ళు రావడంతో కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ప్రస్తావనను పదే పదే తేవడంతో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో పెళ్లిల్ల సంఖ్య పెరిగింది. మెయిన్ గా హీరోయిన్స్ మూడు పదులు దాటగానే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు శ్రద్దా వంతు వచ్చింది. మరి ఎడడుగుల అనంతరం సాహు సుందరి సినిమాల వైపు చూస్తుందో లేదో?