Asianet News TeluguAsianet News Telugu

అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొన్న ప్రభాస్ హీరోయిన్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ విజయదశమి సందర్భంగా లగ్జరీ కారు సొంతం చేసుకుంది. 2010లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా కపూర్.. టీన్ పట్టి, ఆషీకీ 2, ఏక్ విలన్, బాగీ, ఎబిసిడి 2 లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Shraddha Kapoor buys luxury car on vijayadasami dtr
Author
First Published Oct 25, 2023, 10:43 AM IST

సినీతారలకు ఖరీదైన కారులపై మోజు ఉంటుంది. అందుకే తరచుగా సెలెబ్రిటీలు మార్కెట్ లోకి కొత్త మోడల్ కారు వస్తే కొనేస్తుంటారు. ఎవరి బడ్జెట్ కి తగ్గట్లు వాళ్ళు లగ్జరీ కారులని సొంతం చేసుకుంటుంటారు. కొందరు స్టార్ సెలెబ్రిటీల గ్యారేజ్ లలో పదుల సంఖ్యలో కార్లు ఉండడం చూస్తూనే ఉన్నాం. 

తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ విజయదశమి సందర్భంగా లగ్జరీ కారు సొంతం చేసుకుంది. 2010లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా కపూర్.. టీన్ పట్టి, ఆషీకీ 2, ఏక్ విలన్, బాగీ, ఎబిసిడి 2 లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాజూకైన అందంతో శ్రద్దా కపూర్ యువతని మాయ చేసి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు పొందింది. 

బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కుమార్తెనే శ్రద్దా కపూర్. అయితే శ్రద్దా కపూర్ ప్రస్తుతం కొన్న కారు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారింది. అత్యంత ఖరీదైన లంబోర్గిని హూరాకిన్ టెక్నిక మోడల్ కారుని శ్రద్దా దాస్ సొంతం చేసుకుంది. ఈ కారు ధర ఏకంగా రూ4 కోట్ల పైమాటే. అంటే శ్రద్దా కపూర్ దాదాపు తాను ఒక చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్ మొత్తం ఖర్చు చేసేసింది. 

శ్రద్దా కపూర్ ఒక చిత్రానికి దాదాపు 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. శ్రద్దా కపూర్ లంబోర్గిని కారు కొన్న విషయాన్ని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విజయ దశమి రోజున శ్రద్దా తనకి ఇష్టమైన కారుని సొంతం చేసుకుంది. దీనితో అభిమానులు శ్రద్దా కపూర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రద్దా కపూర్ లాగే కారు కూడా చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా శ్రద్దా కపూర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం సాహో. శ్రద్దా ప్రభాస్ సరసన నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై నిరాశ పరిచింది. ప్రస్తుతం శ్రద్దా కపూర్ బాలీవుడ్ చిత్రాలని కొనసాగిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios