ఆటో డ్రైవర్ బుగ్గలు గిల్లి ఏం చేసిందో చూడండి!

shraddha das midnight prank with auto driver
Highlights

ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు రోడ్ మీద బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ చిందులు వేయడం 

ఈ మధ్యకాలంలో చాలా మంది తారలు రోడ్ మీద బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటూ చిందులు వేయడం మరికొంతమంది సరదా కోసం పరిచయం లేని వ్యక్తులు ఆటపట్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో బ్యూటీ ఓ ఆటో డ్రైవర్ ను ప్రాంక్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. నటిగా టాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించిన శ్రద్దాదాస్ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తెలుగులో ఆమె ఆఖరిగా కనిపించిన సినిమా 'గరుడ వేగ'.

అయితే ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. రాత్రిపూట సరదాగా బయటకు వెళ్లిన శ్రద్ధా ఓ ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్లి అతడి బుగ్గలను పట్టుకొని గిల్లింది. ఆ వెంటనే వెనక్కి తిరిగి నవ్వుతూ పరిగెత్తింది. ఇక శ్రద్ధా ఊహించని చర్యతో షాక్ అయ్యాడు ఆటో డ్రైవర్. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ పెద్దాయనను పట్టుకొని ఇలా అల్లరి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై స్పందించిన శ్రద్ధా ఎవరూ తప్పుగా అనుకోవద్దని.. ఆ ఆటో డ్రైవర్ ను కలిసి మాట్లాడానని అతడు నవ్వేసి ఊరుకున్నాడని వెల్లడించింది. 

 

loader