బుల్లితెరపై కూడా రాధే శ్యామ్ ప్లాప్ షో కొనసాగించింది. దారుణమైన టిఆర్పి దక్కించుకొని ప్రభాస్ కి ఆయన అభిమానులకు షాక్ ఇచ్చింది.

టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది రాధే శ్యామ్(Radhe Shayam). భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. మొత్తంగా వంద కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించగా పూజా హెగ్డే నటించారు. కనీసం ప్రభాస్ అభిమానులకు కూడా రాధే శ్యామ్ నచ్చలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో రాధే శ్యామ్ పరాజయం చవిచూసింది. 

ఇక రాధే శ్యామ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాధే శ్యామ్ ప్రసారం చేశారు. బుల్లితెర ప్రేక్షకుల నుండి కూడా రాధే శ్యామ్ తిరస్కరణ ఎదుర్కొంది. రాధే శ్యామ్ దారుణమైన టీఆర్పీ అందుకుంది. ఈ చిత్రానికి కేవలం 8.25 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఫలితంతో సంబంధం లేకుండా ఓ స్టార్ హీరో సినిమాకు ఈ స్థాయి టీఆర్పీ అంటే తక్కువే. రాధే శ్యామ్ టీఆర్పీ చూసి నిరాశ చెందుతున్నారు. టైర్ టు, టైర్ త్రీ హీరోల చిత్రాలు కూడా అంతకంటే మెరుగైన రేటింగ్ అందుకున్నాయి. 

ఇక ప్రభాస్(Prabhas) చిత్రాల్లో బాహుబలి 2 అత్యధిక టీఆర్పీ దక్కించుకుంది. 22.7 టీఆర్పీ ఈ చిత్రానికి దక్కింది. ఇక అలా వైకుంఠపురంలో మూవీ 29.4 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా సరిలేరు నీకెవ్వరు 23.4 టీఆర్పీ తో రెండో స్థానంలో కొనసాగుతుంది. శ్రీమంతుడు 22.54, దువ్వాడ జగన్నాధం 21.7 రేటింగ్ తో టాప్ ఫైవ్ లో ఉన్నాయి.

కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా రెండు ప్లాప్స్ అందుకున్నారు. సాహూ, రాధే శ్యామ్ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. సాహో కనీసం హిందీలో విజయం సాధించింది. రాధే శ్యామ్ మాత్రం అన్ని భాషల్లో ఫెయిల్ అయ్యింది. దీనితో ప్రభాస్ ఫాన్స్ ఆయన సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.