ఎయిర్పోర్ట్ సిబ్బందిని తోసేసిన చిరంజీవి.. నాగార్జునకో న్యాయం, చిరుకో న్యాయమా?.. రెచ్చిపోయిన ట్రోలర్స్
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ట్రోలర్స్ బారిన పడ్డారు. ఆయన ఎయిర్పోర్ట్ లో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి గత వారం రోజులుగా పారిస్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ తో కలిసి ఆయన ఒలంపిక్ గేమ్స్ లో పాల్గొన్నారు. భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి పారిస్ అందాలను ఆస్వాధించడంతోపాటు ఒలంపిక్ గేమ్స్ ని తిలకిస్తూ సరదాగా గడిపారు. అక్కడి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరించారు. తాజాగా పారిస్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు మెగాస్టార్.
హైదరాబాద్ వస్తున్న చిరంజీవి ఎయిర్పోర్ట్ జరిగిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ట్రోల్స్ కి గురవుతుంది. చిరంజీవిని పట్టుకుని ఆడుకుంటున్నారు ట్రోలర్స్. నాగార్జునకో న్యాయం, చిరంజీవికో న్యాయమా అంటున్నారు. మరి ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగిందనేది చూస్తే.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తన భార్య సురేఖతో కలిసి బయటకు వచ్చారు. బ్లాక్ గ్లాసెస్ ధరించి ఉన్నాడు చిరు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది చిరంజీవితో ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. చిరంజీవి పట్టించుకోకుండా మామూలుగా వెళ్లిపోయాడు. అదే వ్యక్తి ముందుకు వచ్చి మళ్లీ చిరంజీవితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
చిరంజీవి అదే సమయంలో టర్న్ తీసుకున్నాడు. తనకు ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నాడు. దీంతో అతన్ని ముందుకు తోశాడు చిరు. సెల్ఫీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని సిబ్బంది ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. దీన్ని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. చిరు చేసింది తప్పు కాదని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ట్రోలర్స్ కి మంచి స్టఫ్ దొరకడంతో వాళ్లు రెచ్చిపోతున్నారు. మొన్న నాగార్జున కూడా ఇలానే ఎయిర్ పోర్ట్ లో వస్తుండగా, ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని సెక్యూరిటీ వాళ్లు పక్కకి లాగేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. నిజానికి అందులో అతన్ని నాగ్ గమనించలేదు. ఆయనకు తెలియకుండానే జరిగింది. అయినా బాగా ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత నాగ్ అతన్ని పర్సనల్గా కలిసినట్టు తెలిసింది. అప్పుడు నాగార్జునని ట్రోల్ చేశారు. ఇప్పుడు చిరుని ఏమంటారు అంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. నాగ్ కో న్యాయం, చిరుకో న్యాయమా అంటున్నారు. మొత్తంగా చిరుని తప్పుపట్టేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మరి ఇది ఎంత వరకు వెళ్తుంది? దీనిపై చిరంజీవి రియాక్ట్ అవుతారా? లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.
చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ఆమెతోపాటు మీనాక్షి చౌదరి, సురభి, మృణాల్ ఠాకూర్, ఇషా చావ్లా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. సోషియో ఫాంటసీగా ఈ మూవీ తెరకెక్కుతుంది.