Asianet News TeluguAsianet News Telugu

'ఆచార్య' .. ఓ షాకింగ్ సీక్రెట్

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రారంభమై కొత్తలో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న కరోనా వైరస్ తో సడెన్ గా బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ సీక్రెట్ బయిటకు వచ్చింది. 

Shocking Secret Of Chiru Acharya OUT!
Author
Hyderabad, First Published Jul 20, 2020, 12:38 PM IST

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రారంభమై కొత్తలో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న కరోనా వైరస్ తో సడెన్ గా బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ సీక్రెట్ బయిటకు వచ్చింది. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చిరంజీవి కవలలుగా... ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి ఫ్యామిలీ మెన్ గా మరకొటి కాలేజి లెక్చరర్ గానూ కనిపించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టూడెంట్ గా కనిపిస్తారు. అతన్ని చంపేస్తారు. డైరక్టర్ కొరటాల శివ ...లెక్చరర్ పాత్రను, స్టూడెంట్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. చిరంజీవి ఇప్పటిదాకా మనం చూడని లుక్ లో క్యారక్టరైజేషన్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.  అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 
 
గతంలో ఈ సినిమాలో తన పాత్ర గురించి అఫీషియల్ గా చిరంజీవి రివీల్ చేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనే విషయమై ఆయన ఓ మీడియా హౌస్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.  తన పాత్ర జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన క్యారక్టర్ ని పోలి ఉంటుందని చెప్పారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.
 
జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ...ఓ ప్రకృతి ప్రేమికుడుగా కనిపిస్తాడు. అలాగే కేవలం ఇష్టపడటమే కాక,దాన్ని రక్షించటానికి కూడా పూనుకుంటాడు. అలాంటి పోలికలతో ఉండే పాత్రను ఈ ఆచార్య సినిమాలోనూ చిరంజీవి చేస్తున్నా అని చెప్పారు. ఆచార్య చిత్రంలో చిరంజీవి సహజ వనరులు కోసం పోరాడే ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు. అందుకోసం ఆయన ఎంత దూరమైనా వెళ్లే పాత్రలో కనిపిస్తారు.
 
అంతే కాకుండా ఈ సినిమాలో చిరంజీవి..గతంలో ఓ నక్సలైట్ గా కనిపిస్తారు. ఆయన్ని గైడ్ చేసే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ఆ సీన్స్ సెకండాఫ్ లో వస్తాయి. అలాగని ఈ సినిమా మెసేజ్ లు చెప్తూ సాగదని, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ కలిగలిసి, ఓ ఇంటిలిజెంట్ స్క్రీన్ ప్లే తో సాగుతుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
 
అంతేకాకుండా చిరంజీవి ప్రత్యేకంగా కొరటాల వర్కింగ్ స్టైల్ ని పొగిడారు. కొరటాల తో పనిచేయటం చాలా మంచి ఎక్సపీరియన్స్ అని చెప్పుకొచ్చారు. ఎన్నో సినిమాలు చేసిన సీనియర్ ..ఇలా ఓ దర్శకుడు గురించి చెప్పటం అంటే మామూలు విషయం కాదు. అలాగే గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అడవి పిల్ల పాత్రలో నటించిన నిహారిక ఇపుడు ఈ చిత్రంలోనూ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతోందిట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios