#Vijay:విజయ్ చివరి సినిమాకు షాకింగ్ రెమ్యునరేషన్, ఊహించలేనంత
ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్.
తమిళ హీరో రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ చిత్రం ఓకే అయింది. అంతేకాదు విజయ్ చివరి సినిమా అని చెప్తున్నారు. తెలుగు నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం కావటంతో ఇక్కడా మనవాళ్లు ఈ సినిమా అప్డేట్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ టాప్ డైరెక్టర్‌తో పాన్ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉన్నారని సమాచారం. ఆ డైరక్టర్ వెట్రిమారన్ అయ్యే అవకాసం ఉంది. ఈ క్రమంలో ఈ క్రేజీ,భారీ సినిమాకు విజయ్ ఎంత ఛార్జ్ చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం 200 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం క్యాష్ క్రింద మొదటే ఇవ్వరని, తమిళ రైట్స్ విజయ్ ఇవ్వటం ద్వారా ఇందులో సగం రెమ్యునరేషన్ అలా ఎడ్జెస్ట్ చేస్తారంటున్నారు. విజయ్‌కు సౌత్ ఇండియాలో బిగ్ మార్కెట్ ఉంది. అందులోనూ చివరి సినిమా అంటే ఆ లెక్కే వేరు అంటున్నారు. బిజినెస్ కూడా మామూలుగా అవ్వదంటున్నారు.
ఇక ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఆస్కార్ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేయటం అంటే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుందంటున్నారు.
ప్రస్తుతం విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే మరో వైపున రాజకీయాల దిశగా విజయ్ వేస్తున్న అడుగుల కారణంగా, ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉంది. విజయ్ గతంలో దిల్ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.