నిర్మాత శోభు కౌంటర్ కి రాజమౌళి ఫన్నీ రిప్లై , అదిరిందిగా
ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కల్కి 2898AD. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదల చేసింది చిత్రయూనిట్.

ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898AD గ్లింప్స్ పై ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా ఈ వీడియోపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ కు బాహుబలి నిర్మాత శోభు ఇచ్చిన కౌంటర్...దానికి రాజమౌళి ఎక్సప్రెషన్ రిప్లై అదిరిపోయింది. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ రాజమౌళి ఏమన్నారు మొదట చూస్తే..
“గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్ పై సినిమాలను రూపొందించడం చాలా కష్టమైన పని.. కానీ మీరు ఆ సాహసం చేసి.. దానిని సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా పై ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్” అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
ఇక రాజమౌళి ట్వీట్‌పై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ చాలా సరదాగా స్పందించారు. ‘చూడండి ఎవరు విడుదల తేదీ గురించి అడుగుతున్నారో!!’ అని పంచ్ ఇచ్చారు. సాధారణంగా రాజమౌళి సినిమా మేకింగ్‌కి చాలా సమయం తీసుకుంటారు. తాను మొదట ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేయరు. కచ్చితంగా తేదీలు మారిపోతూ ఉంటాయి. అందుకే, ఆయనపై వెటకారంగా శోభు యార్లగడ్డ అలా పంచ్ వేశారు. ఈ ట్వీట్‌కు నెటిజనుల నుంచి మంచి స్పందన వస్తోంది. దానికి రాజమౌళి ఇలా ఫన్నీ జిఫ్ తో రిప్లై ఇచ్చారు. ఇదంతా చూసి రాజమౌళి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.