యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 

యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

అలాగే పునీత్ రాజ్ కుమార్ సోదరుడు హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ కూడా అతిథిగా హాజరయ్యారు. శివరాజ్ కుమార్ ప్రీ రిలీజ్ లో అద్భుతంగా ప్రసంగించారు. తన సోదరుడు పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకుంటూ శివరాజ్ కుమార్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అప్పు అందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని శివరాజ్ కుమార్ అన్నారు. 

ఇక తాను రాజమౌళికి పెద్ద అభిమానిని అని శివరాజ్ కుమార్ అన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ సినిమాలని తాను ఫస్ట్ డేనే చూస్తానని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్, అజిత్, విజయ్ సినిమాలంటే కూడా తనకు ఇష్టం అని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే వ్యక్తులు కాదు అని.. ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబం అని శివరాజ్ కుమార్ అన్నారు. 

శివరాజ్ కుమార్ తో ఎన్టీఆర్, రాజమౌళి, రాంచరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ దేశం మొత్తం చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.