పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ సీన్ కి టైమ్ ఉంది లెండి. అయితే అత్తారింటికి దారేది అంటే మన పవన్ గుర్తొస్తాడు అయితే తమిళ్ లో శింబు ఆ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అత్త కోసం వచ్చిన హీరో ఇప్పుడు మన మహేష్ ను కలిశాడు. 

రామోజీ ఫిల్మ్ సిటీలో అత్తారింటికి దారేది రీమేక్ 'వంత రాజవతన్ వరువేన్' షూటింగ్ జరుగుతోంది. ఇక సమీపంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శింబు మహర్షి సెట్ కు వచ్చి  చిత్ర యూనిట్ ని కలిశాడు. 

మహేష్ బాబును కలిసి కొద్దీ సేపు ముచ్చటించాడు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఇద్దరు హీరోలు ఫ్రెండ్లిగా కనిపించడంతో అభిమానులు పోటోలను తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇక శింబు నటిస్తున్న అత్తారింటికి దారేది రీమేక్ కు సుందర్ సి దర్శకత్వం వహిస్తుండగా మేఘా ఆకాష్ - క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.