భార్య నిద్రపోయాక.. మరదలితో పార్టీ చేసుకునే వాడిని, శిల్పా శెట్టి భర్త సంచలన వ్యాఖ్యలు
శిల్ప శెట్టి భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ కుంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య పడుకున్నాక మరదలితో కలిసి పార్టీలకు వెళ్లేవాడిని అన్నారు రాజ్ కుంద్ర.

చాలా కాలం అజ్ఞాతంలో ఉన్న బాలీవుడ్ నిర్మాత, రాజ్ కుంద్ర తాజాగా ఓ షోలో సంచలన వ్యాఖ్యలుచేశారు. పోర్న్ గ్రఫీ కేసు తరువాత చాలా కాలం బయటకు రాకుండా గడిపేసిన ఆయన తాజాగా హిందీ టెలివిజన్ రంగంలో టాప్ షోగా పేరున్న కపిల్‌శర్మ కామెడీ షోకు రాజ్‌కుంద్రా తన భార్య శిల్పాశెట్టి, మరదలు షమిత శెట్టి కలిసి వచ్చారు. ఈ షోలో రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది అన్నారు.
అయితే అప్పుడు తనకు పార్టీలకు వెళ్ళాలి అనిపించనప్పుడు మాత్రం... శిల్ప చెల్లెలిని పిలిచేవాడిని. తను అడిగిన వెంటనే నో చెప్పకుండా తనకు తోడుగా వచ్చేది అన్నారు రాజ్ కుంద్ర. అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్‌లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లికావాలని నేను కోరుకోను అంటూ కామెంట్ చేశాడు రాజ్ కుంద్ర. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్ గానే వెళ్తోంది. నెట్టింట్లో రకరకాలుగా స్పందిస్తున్నారు నాలు.
50 ఏళ్లకు దగ్గరగా ఉన్నా ఏమాత్రం వన్నెతగ్గని సొగసులతో బాలీవుడ్ ను దుమ్ము దులుపుతోంది శిల్పా శెట్టి. దాదాపు 14 ఏళ్ళ క్రితం బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను పెళ్ళాడింది శిల్ప. ఆతరువాత రీసెంట్ గా పోర్న గ్రాఫీ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి రెండు నెలలు జైల్లో ఉన్నారు రాజ్ కుంద్రా. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక మాస్కుతోనే బయట దర్శనమిస్తూ వస్తున్నాడు.
తాజాగా ఈ వ్యావహారం చల్లబడింది. మళ్ళీ గతంలో మాదిరి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు రాజ్ కుంద్ర. మరి సారి తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎటువంటి చిక్కులు ఎదుర్కొంటారో చూడాలి మరి. ఇక తాను నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం ఓ సినిమా కూడా చేస్తున్నాడు రాజ్. ఈసినిమాలో తానే హీరోగా నటిస్తుండగా.. తను ఆరోపణలు ఎదర్కోన్న అప్పటి నుంచి.. రెండు నెలల్ జైల్లో అనుభవించిన నరకం.. తోపాటు.. అసలు విషయాలు సినిమా రూపంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.