Asianet News TeluguAsianet News Telugu

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా..

తమ రేటింగ్‌ కోసం, సెన్సేషన్‌ కోసం తమని కించపరిచేలా వ్యవహరించారంటూ మీడియా సంస్థలపై శిల్పాశెట్టి కోర్ట్ ని ఆశ్రయించారు. ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు.

shilpa shetty filed defamation suit on media organizations in mombay high court arj
Author
Hyderabad, First Published Jul 29, 2021, 9:13 PM IST

నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆర్టికల్స్ ప్రచురించాయని, వార్తలను టెలికాస్ట్ చేశాయని  గురువారం ఆమె ముంబాయి హైకోర్ట్ లో ఫైల్‌ దాఖలు చేశారు. తనతోపాటు తన భర్త, తన కుటుంబానికి పరువు నష్టం కలిగి విధంగా మీడియా కథనాలున్నాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. తమ రేటింగ్‌ కోసం, సెన్సేషన్‌ కోసం తమని కించపరిచేలా వ్యవహరించారంటూ 29 మీడియా సంస్థలపై ఆమె కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే దీనిపై బాంబే కోర్టు రేపు(శుక్రవారం) విచారణ చేపట్టనుందని సమాచారం. ఇందులో ఎలక్ర్టానికి్‌, ప్రింట్‌, డిజిటల్‌ మీడియా సంస్థలు, అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఆ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రాజ్‌కుంద్రాకి సంబంధించి పోర్న్ వీడియోల రాకెట్‌లో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.చాలా మంది హీరోయిన్లు బయటకు వచ్చి రాజ్‌కుంద్రా ఆగడాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నటి షెర్లీన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీస్‌ విచారణలోనూ అనేక షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. మార్చి 2019 మార్చిలో రాజ్‌కుంద్రా, అతని టీమ్‌ను బిజినెస్ మీటింగ్ కోసం ఆమె కలిసినట్లు చెప్పారు. మీటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా రాజ్ తన ఇంటికి వచ్చారని పోలీసులకు షెర్లీన్ చోప్రా స్టెట్‌మెంట్ ఇచ్చారు.

శిల్పా శెట్టితో సరైన సంబంధాలు లేవని ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటోందని రాజ్‌కుంద్రా తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తనను హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో షెర్లీన్ చోప్రా తెలిపారు. రాజ్‌కుంద్రా ప్రవర్తనతో భయం వేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు షెర్లీన్ చోప్రా వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios