Asianet News TeluguAsianet News Telugu

‘లవ్‌ స్టోరీ’ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ఛీఫ్ గెస్ట్ లు ఎవరంటే..?

హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగార్జునతో పాటు దర్శకుడు సుకుమార్‌ హాజరుకానున్నారు.

Shekar Kammula Love Story movie Magical Success Meet
Author
Hyderabad, First Published Sep 28, 2021, 2:28 PM IST

నాగచైతన్య హీరోగా .. సాయిపల్లవి హీరోయిన్ గా  'లవ్ స్టోరీ' సినిమా తెరకెక్కింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొట్టేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత, వీకెండ్ తరువాత కూడా తన జోరును కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజున నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. మంగళవారం (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 6 గంటలకు మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాగార్జునతో పాటు దర్శకుడు సుకుమార్‌ హాజరుకానున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కొన్ని కారణాల వలన రాలేకపోయిన నాగార్జున, ఈ ఫంక్షన్ కి హాజరవుతుండడం విశేషం. నారాయణ దాస్ నారంగ్ ..  రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా ఇదే. అయితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? కలెక్షన్లు ఎలా ఉంటాయన్న అనుమానాలను ఈ సినిమా పటాపంచలు చేసిందనే చెప్పాలి. తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే యూఎస్‌ బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు రాబట్టిందట. 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ‘ల‌వ్‌స్టోరీ’ నిలిచింది. ఇకపోతే లవ్‌స్టోరీ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తొలిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటు ఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని, యూఎస్‌లో 2.9 కోట్ల వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది.  లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 30 కోట్లకుపైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసుకుంది. ఇక విడుదల తర్వాత సినిమాపై మంచి బజ్‌ రావడంతో రికార్డు దిశగా వసూళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios