ఇటీవల నితిన్‌, రానా, నిఖిల్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ మ్యారేజ్‌ జీవితంలోకి అడుగుపెట్టారు. కరోనా టైమ్‌లో మ్యారేజ్‌ తంతుని కంప్లీట్‌ చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంటర్‌ అయ్యారు. ఇక మెగా డాటర్‌ నిహారికా సైతం ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. త్వరలో ఆమె కూడా తన మెడలో మూడు ముళ్ళు వేసుకోబోతుంది. 

ఇక టాలీవుడ్‌లో మరో పెళ్ళి బాజా మోగనుంది. మరో యంగ్‌ హీరో బ్యాచ్‌లర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పబోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అయిన శర్వానంద్‌ సైతం పెళ్ళి చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడట. తనతోటి నటులు ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేస్తోన్న నేపథ్యంలో ఇక తాను కూడా ఆ తంతుని కంప్లీట్‌ చేసుకోవాలనుకుంటున్నాడట. 

ఇదిలా ఉంటే శర్వానంద్‌ ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తన చిన్ననాటి స్నేహితురాలితో ఆయన ప్రేమాయాణం సాగిస్తున్నారట. చాలా రోజులుగా వీరిద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారని, ఇక తాము కూడా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. చిన్నప్పటి ఫ్రెండ్‌ అయిన పారిశ్రామిక వేత్తని శర్వా వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం.

 వీరి ప్రేమకి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారట. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌, మ్యారేజ్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో వైరల్‌ అవుతుంది. మరి ఇది నిజమేనా? లేక గాలి వార్తనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. శర్వానంద్‌ ప్రస్తుతం `శ్రీకారం` చిత్రంలో నటిస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్‌లో పెట్టారు.