శర్వానంద్‌, రక్షితా రెడ్డి ఎంగేజ్‌ మెంట్‌ జరిగి ఐదు నెలలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనేది క్లారిటీ లేకపోవడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి.

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ కి ఆ మధ్య ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్‌ రెడ్డి కుమార్తె రక్షితారెడ్డితో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఆమె యూఎస్‌లో సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగిన వీరి ఎంగేజ్‌ మెంట్‌కి టాలీవుడ్‌ సెలబ్రిటీలు భారీగా పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, నాగచైతన్య, అఖిల్‌, అమల, దిల్‌రాజుతోపాటు నిర్మాతలు, హీరోలు పాల్గొని కాబోయే జంటని ఆశీర్వదించారు.

అయితే శర్వానంద్‌, రక్షితా రెడ్డి ఎంగేజ్‌ మెంట్‌ జరిగి ఐదు నెలలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనేది క్లారిటీ లేకపోవడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అవి రూమర్లుగా మారాయి. శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందా అనే గాసిప్‌ ఊపందుకుంది. రూమర్స్ వైరల్‌గా మారడంతో తాజాగా శర్వానంద్‌ టీమ్‌ స్పందించింది. ఈ రూమర్లని కొట్టిపారేశారు. ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ కాలేదని స్పష్టం చేశారు. శర్వానంద్‌ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల గ్యాప్‌ తీసుకున్నారని, కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక మ్యారేజ్‌ ఉంటుందని తెలిపారు. 

`శర్వానంద్‌, రక్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌ విషయంలో హ్యాపీగా ఉన్నారని, ప్రస్తుతం శర్వానంద్‌.. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందని, ఇటీవలే నలభై రోజులపాటు లండన్‌లో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని వచ్చారని, ఒప్పుకున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేస్తాడని తెలిపారు. ప్రస్తుతం రెండు ఫ్యామిలీలు హైదరాబాద్‌లోనే ఉన్నారని, త్వరలోనే రెండు కుటుంబాలు కలుసుకుని మ్యారేజ్‌ డేట్‌ని ఫైనల్‌ చేస్తారని వెల్లడించారు.