శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'రణరంగం' సినిమాలో కాజల్ ఒక హీరోయిన్ గా కనిపించింది. అయితే సినిమాలో ఆమె పాత్ర చూసిన వారంతా కూడా పెదవి విరిచారు. స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఇంత చిన్న పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకుందని, అసలు ఆమె ఈ సినిమా ఎందుకు చేసిందని రకరకాల ప్రశ్నలు తలెత్తాయి.

వీటన్నింటికీ హీరో శర్వానంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాలో కాజల్ కి లెంగ్తీ క్యారెక్ట‌రే ఇచ్చారట. కానీ లెంగ్త్ ఇష్యూల వలన ఆ పాత్రను  కుదించాల్సి వచ్చిందట. చిన్న పాత్ర అయినా కాజల్ నటించడానికి ముందుకొచ్చిందని.. నిజానికి అది లెంగ్తీ రోల్ అయినప్పటికీ.. నిడివి ఎక్కువైందని.. ఆ పాత్రను కుదించేశామని చెప్పుకొచ్చాడు శర్వా.

అలానే ఈ సినిమా పాత గ్యాంగ్ స్టర్ సినిమాలను పోలి ఉందని.. కథ విషయంలో శర్వా జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వినిపించాయి. దీనిపై స్పందించిన శర్వా.. కథ కొత్తగా చెప్పాలని, సందేశం ఇవ్వాలని సినిమా చేయలేదని.. స్క్రీన్ ప్లే నచ్చి సినిమా చేసినట్లు చెప్పారు. ప్రెజెంట్ కొంత‌, పాస్ట్ కొంత చూపిస్తూ స్క్రీన్ ప్లేని నడిపించినట్లు చెప్పారు. అయితే రివ్యూలలో ఇంత బెస్ట్ క్వాలిటీ సినిమా చూడలేదని రాశారని.. అది పెద్ద కాంప్లిమెంట్ అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమాలో తన క్యారెక్టర్ కుకళ్యాణీ క్యారెక్టర్ కి మధ్య సాగిన లవ్ స్టోరీ బాగా వచ్చిందని.. ఇంత మంది లవ్ ట్రాక్ ఇప్పటివరకు చూడలేదని చెప్పాడు. ఇంత మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదని.. తెరపై తనకు తను కొత్తగా కనిపిస్తున్నానని చెప్పుకొచ్చాడు.