గుడ్ న్యూస్.. త్వరలో తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్
టాలీవుడ్ ఓ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో రాణిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు.

టాలీవుడ్ ఓ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో శర్వానంద్ వరుస చిత్రాలతో రాణిస్తున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా శర్వానంద్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. శర్వానంద్ ఈ ఏడాది జూన్ లో ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి ముగింపు పలికాడు.
రక్షిత రెడ్డి అనే యువతితో శర్వానంద్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా శర్వానంద్ ఫ్యామిలీ మరోసారి సంబరాల్లో మునిగితేలే క్షణాలు వచ్చేశాయి. అందుతున్న సమాచారం మేరకు శర్వానంద్, రక్షిత రెడ్డి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది.
రక్షిత రెడ్డి గర్భవతి అయినట్లు వార్తలు వస్తున్నాయి. రక్షిత అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. దీనితో ఈ జంట అమెరికా వెళుతూ.. ఇండియాకి వస్తూ గడుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ యుఎస్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ సమయంలోనే శర్వా ఇండియాకి వస్తున్నాడట. ఐదు నెలల్లోనే శర్వా, రక్షిత రెడ్డి దంపతులు ఫాన్స్, అండ్ ఫ్యామిలీకి గుడ్ న్యూస్ అందించారు.
ఈ న్యూస్ ని ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. అందుతున్న సమాచారం మేరకు రక్షిత రెడ్డి డెలివరీ కూడా యుఎస్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
శర్వానంద్ సతీమణి రక్షిత రెడ్డి హైదరాబాద్ హైకోర్టు అడ్వకేట్ కుమార్తె అనే సంగతి తెలిసిందే. అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు.