రష్మికను అడ్డం పెట్టి పోటీలోకి దూకాలా లేక సైలెంట్ గా సైడ్ అయ్యి నెక్ట్స్ రిలీజ్ డేట్ కు రావాలా అనేది తేలటం లేదట. ఏదైమైనా త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ పై ప్రకటన రావచ్చు. 

కొన్నేళ్లుగా శర్వానంద్‌కు (Sharwanand) సరైన సక్సెస్ లేదు. సినిమాల కథలు పరంగా బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు. గతేడాది శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన, ఓటీటీలో విడుదలై బాగుందనిపించుకుంది. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ సినిమాతో పలకరించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ‘మహా సముద్రం’ భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు శర్వాకు హిట్ అత్యవసరం. ఆచి తూచి అన్ని చూసుకుని అడుగు ముందుకు వెయ్యాలి. ప్రతీ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

ఇక శర్వానంద్ లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ మంచి వ్యూస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరి 25న విడుదలకానున్న ఈసినిమాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అందుకు కారణం అనుకోని విధంగా భీమ్లానాయక్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించి రేస్ లోకి రావటమే. ఈ నేపధ్యంలో ఈ సినిమా వాయిదా పడే అవకాసం ఉందని వినికిడి. ఈ మేరకు దర్శక,నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట.

ఏప్రియల్ 1 గాని రెండు గానీ రిలీజ్ డేట్ పెట్టుకుంటే బెస్ట్ అనే ఆలోచనలో ఉన్నారట. ధైర్యం చేస్తే రష్మికను బేస్ చేసుకుని చేయాలంటున్నారు. శర్వానంద్ ఫామ్ లో లేడు. డైరక్టర్ కు క్రేజ్ లేదు. దాంతో రష్మికను అడ్డం పెట్టి పోటీలోకి దూకాలా లేక సైలెంట్ గా సైడ్ అయ్యి నెక్ట్స్ రిలీజ్ డేట్ కు రావాలా అనేది తేలటం లేదట. ఏదైమైనా త్వరలోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ పై ప్రకటన రావచ్చు.

ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కూడా షూటింగ్ కంప్లీటై ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక, కుష్బూ, ఊర్వశి నటించారు.