ఒకవైపు వీరయ్య, మరోవైపు రామరాజు.. శర్వానంద్ న్యూ ఇయర్ పార్టీ అదిరిపోలా, మెగా హీరోలతో సర్ప్రైజ్
సైలెంట్ గా, కూల్ గా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు శర్వానంద్. హీరోగా శర్వానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కి మంచి గుర్తింపు ఉంది.

సైలెంట్ గా, కూల్ గా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు శర్వానంద్. హీరోగా శర్వానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కి మంచి గుర్తింపు ఉంది. శర్వానంద్ చివరగా 'ఒకే ఒక జీవితం' చిత్రంలో నటించాడు.
టైం ట్రావెల్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా శర్వానంద్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్త సంవత్సరం వేడుకల్లో సెలెబ్రిటీలంతా మునిగితేలుతున్నారు. శర్వానంద్ ఇద్దరూ స్పెషల్ పర్సన్స్ తో 2023కి స్వాగతం పలికాడు.
వాళ్లిద్దరూ ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్. మెగా ఫ్యామిలీతో శర్వానంద్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. రాంచరణ్, శర్వానంద్ ఇద్దరూ స్కూల్ మేట్స్. దీనితో చరణ్ తో శర్వాకి చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది.
శర్వానంద్.. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరితో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటున్న పిక్ పోస్ట్ చేశాడు. చిరు, చరణ్ మధ్యలో శర్వా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. 'హ్యాపీయెస్ట్ డే.. హ్యాపీ న్యూ ఇయర్ గయ్స్' అంటూ శర్వానంద్ పోస్ట్ పెట్టాడు. ఈ క్రేజీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకే ఒక జీవితం తర్వాత శర్వానంద్ కొత్త చిత్రానికి ఇంకా సైన్ చేయలేదు. త్వరలో తన తదుపరి చిత్రాన్ని శర్వా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.