షారుఖ్-అట్లీ మూవీకి సంబధించి క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో షారుఖ్ జంటగా నటిస్తోన్న నయనతార షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి నయన్ ఈ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు...? 

షారుఖ్-అట్లీ మూవీకి సంబధించి క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో షారుఖ్ జంటగా నటిస్తోన్న నయనతార షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి నయన్ ఈ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు...?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్ర‌స్తుతం ప‌ఠాన్ సినిమా చేస్తున్నారు. సిద్దాంత్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈమూవీలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ పాత్ర చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమాలో సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార షారుఖ్ జోడీగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు మేక‌ర్స్. 

అయితే చాలా రోజుల త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పటికే స్టార్ట్ అయిన ముంబయ్ షూటింగ్ షెడ్యూన్ ఈనెల 18 తో పూర్తి అవుతుందట. అంతేకాదు న‌యన‌తారం ఏప్రిల్ 18 లోపు ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయ‌నుందని టాక్‌. ఆ త‌ర్వాత‌ త‌న కొత్త చిత్రం కాతువాకుల రెండు కాధ‌ల్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో న‌య‌న్ చెన్నైకు తిరుగు ప్రయాణం కానుంద‌ని స‌మాచారం. 

మ‌రోవైపు రాజ్ కుమార్ హిరానీతో కూడా ఓ సినిమా లైన్‌లో పెట్టాడు షారుక్‌ఖాన్‌. రాజ్‌కుమార్ హిరానీ, ఆట్లీ సినిమాల‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ షారుక్ ఖాన్‌ సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు న‌య‌న‌తార ఏప్రిల్ 18 వ‌రకు షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని... విఘ్నేశ్ శివ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీ కానుందని సమాచారం. లయ‌న్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ముంబై షూటింగ్ షెడ్యూల్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.