టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకుడిగా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసిన మనోడికి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ అందడం లేదు. అనగనగా ఒక ధీరుడు - సైజ్ జీరో సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ అనుకున్నంతగా సక్సెస్ కొట్టలేకపోయాడు. 

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తో ఒక సినిమాను తెరకెక్కించాడు. 'మెంటల్ హై క్యా' అనే ఆ డిఫరెంట్ సినిమా జూన్ 21న విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా రూమర్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. 

అయితే సినిమాలో షారుక్ కొన్ని నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలు కన్ఫర్మ్ చేసేస్తున్నాయి. చిత్ర యూనిట్ నుంచి కూడా ఇదే టాక్ వస్తున్నట్లు చెప్పడంతో తెలుగు దర్శకుడి సినిమాలో చాలా రోజుల అనంతరం ఒక బాలీవుడ్ హీరో కనిపించనున్నట్లు మరిన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ద్వారా ప్రకాష్ ఏ రేంజ్ లో హిట్టందుకుంటాడో చూడాలి.