Asianet News TeluguAsianet News Telugu

‘సలార్’ నిర్మాతల మాస్టర్ స్ట్రాటజీ, ఇంతకు ముందు ఇలాగే ప్లే చేసారు

 రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతలు మొదటి నుంచి ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సంవత్సరంలో రిలీజ్ కు అనుకూలించే మంచి రోజులు ను బ్లాక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న కంటెంట్ ని బట్టి వారు ఎడ్జెస్ట్ చేస్తున్నారు. 

Sharuk Khan #Dunki vs #SalaarCeaseFire Hombale films master strategy again jsp
Author
First Published Sep 26, 2023, 10:40 AM IST

ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ‘సలార్’ రిలీజ్ డేట్ కబుర్లే. అఫీషియల్ గా ఈ సినిమా గురించి ప్రకటించనప్పటికీ ...బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ఓ డేట్ బయిటకు వచ్చి వైరల్ అవుతోంది.  ఈ చిత్ర విడుదల తేదీ ఫిక్సయినట్లుగా బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.అయితే అందులో ఎంతవరకూ నిజం అనేది ఎవరికీ అర్దం కావటం లేదు. కానీ అదే డేట్ కు ఫిక్స్ అయ్యిపొమ్మని డిస్ట్రిబ్యూటర్స్ కు ఆల్రెడీ చెప్పినట్లుగా వార్త ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా క్రిస్మస్ (Christmas) కానుకగా.. 22 డిసెంబర్ 2023న విడుదల కాబోతోందని తెలుస్తోంది.

 అయితే అదే రోజున బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ (SRK) నటించిన ‘డుంకీ’ (Dunki)రిలీజ్  కూడా ఉండటంతో.. మరోసారి ‘సలార్’ విడుదలపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే మేకర్స్ మాత్రం.. ఇప్పుడు వినిపిస్తున్న డేట్‌కి ‘సలార్’ని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది. అదే జరిగితే.. ప్రశాంత్ నీల్ చిత్రం.. షారుఖ్ చిత్రానికి పోటీ పడటం ఇదే రెండోసారి అవుతుంది.  గతంలో  2018లో ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్’ (KGF), షారుఖ్ ‘జీరో’ (Zero) చిత్రాలు డిసెంబర్‌లో పోటీ పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వారి మధ్య ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి షారుఖ్ ‘డుంకీ’ చిత్ర విడుదల తేదీని ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే డేట్ అంటే.. కొంత క్లాష్ ఏర్పడే అవకాశాలు అయితే లేకపోలేదు.  

ఇక రిలీజ్ డేట్స్ విషయంలో నిర్మాతలు మొదటి నుంచి ఓ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. సంవత్సరంలో రిలీజ్ కు అనుకూలించే మంచి రోజులు ను బ్లాక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న కంటెంట్ ని బట్టి వారు ఎడ్జెస్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు #Yash నటించిన #KGFChapter2 విషయానికి వస్తే... 14 ఏప్రియల్ 2022 న రిలీజ్ చేసారు. అయితే ఆ రోజు కోసం ముందే సలార్ రిలీజ్ ఆ రోజు చేస్తామని డేట్ ని లాక్ చేసుకున్నారు. సలార్ ని ప్రక్కన పెట్టి కేజీఎఫ్ 2 ని వదిలారు. అప్పుడు విజయ్  #Beast చిత్రం పోటీగా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. తమ బ్యానర్ లో రెడీ అవుతున్న యువ చిత్రం కు 22 డిసెంబర్ 2023న విడుదల చేస్తామని డేట్ లాక్ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్ ని సలార్ కు వినియోగించబోతన్నట్లు సమాచారం. 

 వాస్తవానికి అన్నీ బాగుండి ఉంటే.. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ చివరి నిమిషంలో విఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని దర్శకుడు భావించడంతో.. సినిమాని వాయిదా వేయక తప్పలేదని అన్నారు. ప్రస్తుతం కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే సినిమా వాయిదా అని అన్నారు కానీ.. మళ్లీ విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు, ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భార్య లిఖితారెడ్డి నీల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘2023 డిసెంబరు ఎప్పటిలా ఉండదు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొనడంతో డిసెంబరులో ‘సలార్‌’ రిలీజ్‌ (Salaar Release Date) ఫిక్స్‌ అని అంతా అనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios