బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కు ఇండస్ట్రీ జెంటిల్‌మెన్‌ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఇటీవల వరుసగా సందేశాత్మక సినిమాల్లో నటిస్తున్న అక్షయ్‌ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ పాజిటివ్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. అయితే గతంలో అక్షయ్‌ పై కూడా ఓ హీరోయిన్ కొన్ని ఎలిగేషన్స్ చేసింది. తన మీద వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడంటూ అక్షయ్‌ గురించి చెప్పింది నటి శాంతి ప్రియ.

తాజాగా లాక్‌డౌన్ సమయంలో ఇండస్ట్రీకి సంబంధించి పాత విషయాలు చాలా తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్షయ్‌ కుమార్, శాంతి ప్రియా విషయంలో చేసిన కామెంట్స్‌ కూడా మరోసారి వైరల్‌ అయ్యాడు. ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా శాంతి ప్రియా మోకాళ్ల పై వరకు ఉన్న డ్రెస్‌లో సెట్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆమె మెకాళ్లు నల్లగా ఉండటం చూసిన అక్షయ్‌, నీకు అక్కడ రక్తం గడ్డ కట్టిందా అంటూ కామెంట్ చేశాడట.

అయితే అక్షయ్ ఆ వ్యాక్యలు సరదాగానే చేసిన అక్కడున్నవారంత ఒక్కసారిగా నవ్వటంతో శాంతి ప్రియకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతేకాదు అక్కడే ఆమె బోరున ఏడ్చేసింది. ఇదే విషయాన్ని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించింది. అయితే అదే వార్త మరోసారి తెర మీదకు రావటంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది శాంతి ప్రియ.

`నేను మీ అందరికీ ఒక విషయంలో క్లారిటీ ఇవ్వ దలుచుకున్నాను. ఆ రోజు అక్షయ్‌ నా విషయంలో చేసిన కామెంట్స్ సరదాగానే అని నాకు తెలుసు. ఆ వ్యాఖ్యలు నన్ను కాలం పాటు వెంటాడినా అక్షయ్‌ నన్ను ఇబ్బంది పెట్టాలని గానీ, అవమానించాలని గానీ ఆ వ్యాఖ్యలు చేయలేదని నాకు తెలుసు. నాకు ఆయన పనితీరు చాలా ఇష్టం` అంటూ క్లారిటీ ఇచ్చింది శాంతి ప్రియ. శాంతిప్రియ, అక్షయ్‌ కుమార్‌లు ఇక్కే పె ఇక్కా, సౌగంధ్‌ సినిమాల్లో కలిసి నటించారు.