శంకర్ ఆశలన్నీ రాంచరణ్ గేమ్ ఛేంజర్ పైనే ఉన్నాయి. భారతీయుడు 2 రిజల్ట్ అర్థం అయిన మూడో రోజే శంకర్ ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.

భారతీయుడు 2 చిత్రం కథ ముగిసినట్లే కనిపిస్తోంది. ఇక ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోలుకునే పరిస్థితి లేదు. శంకర్ వేసిన తప్పటడుగు చాలా కాస్ట్లీ గా మారుతోంది. కాలం చెల్లిన సబ్జెక్ట్ ని సీక్వెల్ చేయడం తప్పుగా మారింది. గత కొంతకాలంగా శంకర్ కి బ్యాడ్ టైం సాగుతున్న సంగతి తెలిసిందే. 

ఇక శంకర్ ఆశలన్నీ రాంచరణ్ గేమ్ ఛేంజర్ పైనే ఉన్నాయి. భారతీయుడు 2 రిజల్ట్ అర్థం అయిన మూడో రోజే శంకర్ ఆ చిత్రాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ కి ఎక్కువ సమయం కేటాయించి అద్భుతమైన అవుట్ పుట్ తీసుకురావాలని శంకర్ భావిస్తున్నారట. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లో ఉంటూ మిగిలిన 10 రోజుల షూటింగ్ కోసం లొకేషన్స్ ఎంపిక చేస్తున్నారట. 

భారతీయుడు 3 కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అది పక్కకి వెళ్ళిపోయినట్లే అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జనాలకు భారతీయుడు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. రాంచరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. 

కార్తీక్ సుబ్బరాజ్ వైవిధ్యమైన కథని ఈ చిత్రం కోసం అందించారు. రాంచరణ్ ఈ మూవీలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు. మిగిలిన 10 రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై శంకర్ ఫోకస్ పెట్టబోతున్నారు.