ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంభందించిన ఓ కీలకమైన అప్డేట్ బయిటకు వచ్చింది.
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంభందించిన ఓ కీలకమైన అప్డేట్ బయిటకు వచ్చింది.
ఈ సినిమా ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ లో మొదలు కానుంది. రెగ్యులర్ షూట్ అతి త్వరలో మొదలుకానుంది. అలాగే షూటింగ్ ఎనిమిది నుంచి పది నెలలు పడుతుంది. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తారు. సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం లొకేషన్స్ విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా లోని ఎక్కువ సన్నివేశాలను రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు శంకర్ స్టైల్ లో పాటలకు భారీ సెట్టింగ్ లు కూడా వేయించబోతున్నారట.
'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇందులో భాగంగానే నటీ నటులను ఎంచుకునే పనిలో ఉందట చిత్ర టీమ్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు 500 కోట్లతో తెరకెక్కిస్తున్నాడట. ఈ మూవీలో చరణ్ మొదట కలెక్టర్ పాత్రలోనూ, ఆ తర్వాత సీఎంగా మారి వ్యవస్థలోని లోపాలను ఎలా సరిచేస్తాడు అనేది శంకర్ తనదైన శైలిలో చూపించబోతున్నాడట.
ఇదిలా ఉండగా...ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ఆయన పాత్ర నెగిటివ్ షేట్స్ తో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. జయరామ్ ఇప్పటికే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' ఓ ముఖ్య పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులోనూ పూర్తి స్దాయి బిజీ అవుతారని భావిస్తున్నారు.
