టాలీవుడ్ లో క్లిక్కయితే ఎక్కడైనా అవకాశాలు ఈజీగా అందుతాయని నార్త్ మోడల్స్ కు ఒక సెంటిమెంట్ ఉంది. అదే తరహాలో అదృష్టాన్ని పరీక్షించుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీకి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న షాలిని పాండేకు మంచి క్రేజ్ ఏర్పడింది. 

చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నెమ్మదిగా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగింది. పెద్ద సినిమాల్లో పాత్ర నచ్చితే సెకండ్ హీరోయిన్ గా చేయడానికి కూడా వెనుకాడలేదు. కానీ సింగిల్ హీరోయిన్ గా బేబీకి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. 

మొన్న కళ్యాణ్ రామ్ 118కూడా షాలిని కెరీర్ కి బూస్ట్ ఇవ్వలేకపాయింది. చాలా వరకు షాలినిని ఎవరు పట్టించుకోవడం లేదు. నాని - శర్వా వంటి హీరోల సినిమాల్లో అవకాశం అందుకునే ఛాన్స్ ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. ఇంతవరకు వాటిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం బేబీ తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే అనుష్క సైలెన్స్ సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నట్లు సమాచారం.