అర్జున్ రెడ్డి సినిమాలో అమాయకంగా బేబీ అంటూ ఘాటైన రొమాన్స్ లో యువతకు సరికొత్త కిక్ ఇచ్చిన బ్యూటీ షాలిని పాండే. అమ్మడిని అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. అయితే గ్లామర్ పాత్రల్లో బేబీ సెట్టవుతుందా అనే కామెంట్స్ కు హాట్ లుక్స్ తో సమాధానం చెబుతోంది. 

రీసెంట్ గా ప్రముఖ ఫొటోగ్రాఫర్ శాల్ప్ నిర్వహించిన ఫొటో షూట్ లో షాలిని ఊహించని విధంగా దర్శనమిచ్చింది. జస్ట్ టాప్ డ్రెస్ లో కనిపించి కుర్రకారు కనులను ఎక్కడికో లాగేస్తోంది. ఇక ఆమె కనులు మత్తుగా ఎదో ఆలోచనలో ఉన్నట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ గా మారింది. 

అర్జున్ రెడ్డి సినిమాతో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నప్పటికీ అమ్మడు ఇంకా తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలను అందుకోవడం లేదు. ఆ సినిమా తరువాత షాలిని మహానటి సినిమాలో సావిత్రి ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. అయితే తమిళ్ లో మాత్రం కొంచెం మంచి ఛాన్సులనే అందుకుంటుంది. 100% లవ్ రీమేక్ తో పాటు రంగం ఫెమ్ జీవా సినిమాలో  హీరోయిన్ గ నటిస్తోంది.