ఆ నేరం క్రింద బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ అరెస్ట్... నిర్వాహకులు అడ్డుకున్నా వదలకుండా!
బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. చరిత్రలో మొదటిసారి ఇలా జరిగింది. ఆడియన్స్ తో పాటు నిర్వాహకులు షాక్ అయ్యారు.

సౌత్ ఇండియాలో బిగ్ బాస్ కన్నడతో స్టార్ట్ అయ్యింది. 2013లో సుదీప్ హోస్ట్ గా సీజన్ 1 ప్రసారమైంది. ప్రస్తుతం సీజన్లో 10 ప్రసారం అవుతుంది. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి. కాగా ఈ సీజన్ కంటెస్టెంట్ గా ఉన్న సంతోష్ వర్తుర్ ని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. హౌస్లో ఓ కంటెస్టెంట్ ని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది.
సంతోష్ వర్తుర్ అరెస్ట్ కి కారణాలు పరిశీలిస్తే... అతడు మెడలో పులిగోరు ధరించాడు. పులిగోరుతో కూడిన ఆభరణాలతో షోలో పాల్గొనడం వివాదాస్పదం అయ్యింది. సంతోష్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. సంతోష్ పులిగోరు ధరించడం వన్యప్రాణి సంరక్షణ చట్టాలను ఉల్లఘించడమే అని పోలీసులు భావించారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రేక్షకుల నుండి కూడా పోలీసులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సంతోష్ అరెస్ట్ అయ్యాడు.
ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల అదుపులో అతడు ఉన్నాడు. అధికారులు సంతోష్ ని విచారిస్తున్నారు. మొదట సంతోష్ ని అరెస్ట్ చేసేందుకు షో నిర్వాహకులు ఒప్పుకోలేదు. అయితే అధికారులు పట్టుబట్టడంతో తప్పక అప్పగించారు. నేరం రుజువైతే సంతోష్ కి మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సంతోష్ ఆల్ ఇండియా హాలిక్కర్ బ్రీడ్ కన్జర్వేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. హాలిక్కర్ బ్రీడ్ పశువుల సంరక్షణకు ఇతడు కృషి చేస్తున్నాడు. హాలిక్కర్ ఒడెయ్య గా ఇతడు ఫేమస్. గతంలో తమిళ బిగ్ షోలో పాల్గొన్న వనిత విజయ్ కుమార్ ని పోలీసులు హౌస్లో విచారించారు. అరెస్ట్ అయితే చేయలేదు.