షారుక్ లేటెస్ట్ మూవీ పఠాన్ విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా షారుక్ తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  

ఒక్క హిట్ అంటూ తపించిపోతున్నాడు షారుక్. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత ఆయనకు మరో సక్సెస్ రాలేదు. ఈ క్రమంలో అనేక ప్రయోగాలు చేశారు. తనకు అచ్చొచ్చిన జోనర్స్ ట్రై చేశారు. ఏం చేసినా ఆయనకు ఓ క్లీన్ హిట్ పడలేదు. దీంతో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. కమ్ బ్యాక్ అనంతరం కసిగా పఠాన్ చిత్రం చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ ఎత్తున పఠాన్ నిర్మించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

విడుదలైన పఠాన్ ట్రైలర్ దుమ్మురేపింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పఠాన్ తెరకెక్కించారు. హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో భారీ స్కేల్ తో తెరకెక్కించారు. షారుక్ లుక్, ఆయన క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక దీపికా పదుకొనె సైతం హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్స్ ని తలపించారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్నారు. మొత్తంగా సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. 

జనవరి 25న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షారుక్ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషెస్ ఆయన తెలుగులో చెప్పడం విశేషం. షారుక్ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు వీడియో వైరల్ అవుతుంది. ఇక దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా టాలీవుడ్ అవతరించిన నేపథ్యంలో ఇక్కడ ఫేమ్ తెచ్చుకునేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రన్బీర్ కపూర్, అక్షయ్, సల్మాన్, షారుక్, హృతిక్ తెలుగులో కూడా తమ చిత్రాలు డబ్ చేసి విడుదల చేస్తున్నారు. 

YouTube video player