స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చిన్న కొడుకుపై షారుఖ్ ట్వీట్.. ఏమన్నారంటే..?
బాలీవుడ్ బాద్ షా కు దేశమంతా డైహాట్ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా షారుఖ్ ఖాన్ అంటే పడి చచ్చిపోతుంటారు జనాలు. అంతే కాదు .. ఈ స్టార్ హీరోకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. ఈ వయస్సులో కూడా సిక్స్ ప్యాక్ తో మెరిసిపోతున్న బాలీవుడ్ బాద్ షా కు దేశమంతా డైహాట్ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా షారుఖ్ ఖాన్ అంటే పడి చచ్చిపోతుంటారు జనాలు. అంతే కాదు .. ఈ స్టార్ హీరోకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది ఇండియన్ యాక్టర్స్ మేము షారుఖ్ అభిమానులం అంటూ వెల్లడించారు కూడా. అయితే రీసెంట్ గా స్టార్ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ తనయుడు... క్యూట్ క్యూట్ బాబు కూడా షారుఖ్ ఫ్యాన్ గా మారిపోయాడు.
మాజీ టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రీసెంట్ గా ఓవీడియోను తన సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా స్పందించారు ఇంతకీ ఆ వీడియో ఏంటీ అంటే..? పఠాన్ మూవీలో పాటను పెట్టగా..ఏడాది వయస్సు ఉన్న తన చిన్న కొడుకు ఫోన్ పట్టుకొని క్యూట్ గా ఎగురుతూ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇది వీడియోగా తీసి ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్ లో షేర్ చేసి షారుఖ్ ని ట్యాగ్ చేశాడు ఇర్పాన్. వీడియోతో పాటు ఇలా రాసుకొచ్చాడు. ఖాన్ సాబ్, నీ లిస్ట్ లో ఇంకో క్యూట్ ఫ్యాన్ యాడ్ అయ్యాడు అని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చుసిన షారుఖ్ దీనికి రిప్లై కూడా ఇచ్చాడు.
ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేసిన వీడియోని షేర్ చేస్తూ షారుఖ్ రిప్లై ట్వీట్ చేశాడు. బాద్ షా ఏమన్నాడంటే..? అతను నీకంటే చాలా ట్యాలెంటు ఉన్నవాడు.. లిటిల్ పఠాన్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ను అటు షారుక్ ఫ్యాన్స్.. ఇటు పఠాన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అలాగే ఇర్ఫాన్ పఠాన్ కొడుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు షారుఖ్.. దాదాపు నాలుగైదేళ్ళు బయటకు రాకుండా సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరో.. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వరుసప్లాప్ లతో.. డౌన్ అయిపోయిన బాలీవుడ్ కు పఠాన్ సినిమాతో ఊతం ఇచ్చాడు షారుఖ్. పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫ్లాప్స్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కు హిట్ ఇచ్చాడు. పఠాన్ షారుఖ్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు బాద్ షా. అందులో సౌత్ డైరెక్టర్ అట్లీ చేస్తున్న జవాన్ కూడా ఒకటి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.