ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీనే తిరగరాసిన సినిమా ఆర్ఆర్ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపి.. రికార్డ్ ల మీద రికార్డ్ లు సాధించిన ఈసినిమా రికార్డ్స్ పై కన్నేశాడు.. బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నాడు..?

బాలీవుడ్ బాద్ షా... షారుఖ్ ఖాన్ లాంగ్ బ్రేక్ తరువాత చేసిన సినిమా పఠాన్. ఈసినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసింది. షారుక్ జోడీగా దీపికా నటించగా.. జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమా తెరకెక్కింది. ఈ జనవరిలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించిన ఈసినిమా వల్ల.. అప్పటి వరకూ పరువు పొగోట్టుకుని.. కామ్ గా ఉన్న బాలీవుడ్ కు ఊపిరులూదింది. అటు షారుఖ్ కూడా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతూ.. సినిమాలకు నాలుగేళ్ల వరకూ గ్యాప్ ఇవ్వగా.. రీ ఎంట్రీని పఠాన్ తో గ్రాంగ్ డా ఇచ్చాడు స్టార్ హీరో. 

ఇక చాలా రోజుల తర్వాత ఓ సినిమా బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత రెండేళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా 1033 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కలెక్షన్లు అయితే సాధించింది కాని.. ట్రిపుల్ ఆర్, కెజియఫ్ లాంటి సౌత్ సినిమాల రికార్డ్స్ ను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది పఠాన్ సినిమా. దాంతో ఆసినిమాల రికార్డ్స్ ను క్రాస్ చేసేలా షారుఖ్ టీమ్ ప్లాన్లు గీస్తున్నట్టు తెలుస్తోంది. 

పఠాన్ సినిమా ఇప్పిటికే ఓటీటీలో రిలీజ్ అయ్యి.. అక్కడ కూడా మంచివిజయం సాధించింది.ఇక తాజాగా ఈసినిమాను విదేశాల్లో..ఇండియన్ సినిమాంటే మంచి గిరాకీ ఉన్న దేశాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే.. ఇప్పటికే పఠాన్ ను జపాన్ లో రిలీజ్ చేయడానికి అన్నిసన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న పఠాన్ సినిమా జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ టీమ్. 

Scroll to load tweet…

జపాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. బాలీవుడ్ సినిమాలకంటే మన సౌత్ సినిమాలనే ఎక్కుగా చూస్తారు జపాన్ ప్రజలు. అందులోను సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎప్పటి నుంచో అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.. బాహుబలి సినిమాతో ప్రభాస్ కూడా అక్కడ భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మన తెలుగు సినిమాలకు కూడా అక్కడా భారీగా అభిమానులు ఉన్నారు. ప్రభాస్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా అనేకమంది హీరోలకు జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. 

ఇక RRR సినిమాతో ఎన్టీఆర్, చరణ్ లకు కూడా జపాన్ లో అభిమానులు ఏర్పడ్డారు. జపాన్ లో రజినీకాంత్ సినిమాల రికార్డుని RRR సినిమా బ్రేక్ చేసి... మొదటి స్థానంలో నిలవగా... కలెక్షన్స్ పరంగా.. ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా... ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం.. ఇలా ఇండియన్ సినిమాల రికార్డులన్నీ ఇప్పుడు జపాన్ లో RRR సినిమాపైనే ఉన్నాయి. దాంతో ఈ రికార్డ్స్ ను బ్రేక్ చేసే విధంగా పఠాన్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. మరి ఈ రికార్డులని పఠాన్ సినిమా బద్దలుకొడుతుందా? RRR కంటే పఠాన్ ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందా చూడాలి.