షారూఖ్ ఖాన్‌ నటించిన `జవాన్‌` చిత్రం విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. ఇది బిజినెస్‌ పరంగా షాకిస్తుంది. తాజాగా భారీ రేట్‌కి  డిజిటల్‌ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం.

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌.. ఈ ఏడాది ప్రారంభంలో `పఠాన్‌` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ సినిమా సుమారు వెయ్యి కోట్ల(గ్రాస్‌) కలెక్షన్లని సాధించింది. దీంతో షారూఖ్‌ నుంచి వచ్చే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన `జవాన్‌` సినిమాలో నటిస్తున్నారు. దీనికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. నయనతార కథానాయికగా నటిస్తుంది. ఆమెకిది ఫస్ట్ బాలీవుడ్‌ మూవీ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. సెప్టెంబర్‌ 7న, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. 

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ వివరాలు షాకిస్తున్నాయి. ఏకంగా రూ.250కోట్లకి డిజిటల్‌(ఓటీటీ, శాటిలైట్‌) రైట్స్ అమ్ముడు పోయాయట. తాజాగా ఈ విషయాన్ని టీమ్‌ వెల్లడించింది. మరోవైపు ఈ సినిమా మ్యూజికల్‌ రైట్స్ రూ.36కోట్లకు అమ్ముడు పోయాయి. టీ సీరిస్‌ ఈ మ్యూజికల్‌ రైట్స్ ని దక్కించుకుంది. ఇలా రిలీజ్‌కి ముందే ఈ సినిమాకి రూ.280కోట్లు వచ్చాయి. ఇక థియేట్రికల్‌ రైట్స్ విషయంలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. థియేట్రికల్‌ రైట్స్ భారీగా అమ్ముడు పోతే రిలీజ్‌కి ముందే నిర్మాతలు లాభాల్లో ఉంటారని చెప్పొచ్చు. 

ఈ సినిమాని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై షారూఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి రెండు నెలల ముందే ఇంత బజ్‌ నెలకోవడం విశేషం. ఇక థియేట్రికల్‌గా ఇది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎందుకంటే దర్శకుడు అట్లీ సినిమాలు ఏదీ డిజప్పాయింట్‌ చేయలేదు. ఆయన కంటెంట్‌ రేంజ్‌ ఏంటో తెలిసిందే. బాలీవుడ్‌ లో షారూఖ్‌ లాంటి భారీ మార్కెట్‌ ఉన్న హీరోతో అట్లీ సినిమా అంటే అది నెక్ట్స్ లెవల్లో ఉంటుందనే అంచనాలు అందరిలోనూ నెలకొన్నాయి. అందుకే `జవాన్‌` కోసం అంతా వెయిటింగ్‌.