Asianet News TeluguAsianet News Telugu

భార్యకి 'అర్జున్ రెడ్డి' బోల్డ్ కిస్!

బాలీవుడ్ స్వీట్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ లు సమయం దొరికినప్పుడల్లా తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. బాలీవుడ్ లో హీరోయిన్ల కంటే మీరా రాజ్ పుత్ కి ఎక్కువ క్రేజ్ ఉందనడంలో అతిసయోక్తి లేదు. 

Shahid Kapoor and Mira Rajput celebrate Diwali with a kiss
Author
Hyderabad, First Published Nov 8, 2018, 3:12 PM IST

బాలీవుడ్ స్వీట్ కపుల్ షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ లు సమయం దొరికినప్పుడల్లా తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. బాలీవుడ్ లో హీరోయిన్ల కంటే మీరా రాజ్ పుత్ కి ఎక్కువ క్రేజ్ ఉందనడంలో అతిసయోక్తి లేదు.

ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయాలని చాలా మంది దర్శకుడు అనుకున్నారు. ఇటీవల ఆమె ఓ యాడ్ లో కూడా నటించింది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా వీరు సోషల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేశారు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తమ పెర్సనల్ ఫోటోని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం షాహిద్ కపూర్ 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో మాదిరి తన భార్యని లిప్ కిస్ చేస్తూ ఉన్న ఫోటోని షేర్ చేయడం విశేషం. ఈ ఫోటోని చూసిన కొందరు నెటిజన్లు ఈ జంటకి తమ విషెస్ చెబుతుంటే మరికొందరు మాత్రం ఈ ఫోటోపై మండిపడుతున్నారు. ఇలాంటి ఫోటోని షేర్ చేయడానికి సిగ్గుగా లేదా అంటూ షాహిద్ పై మండిపడుతున్నారు. 

ఇక సినిమా విషయానికొస్తే.. 'అర్జున్ రెడ్డి' రీమేక్ కి 'కబీర్ సింగ్' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్  చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios