Asianet News TeluguAsianet News Telugu

పెద్దయెత్తుల కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రయీస్ చిత్రం

  • షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ చిత్రానికి భారీ కలెక్షన్లు
  • వంద కోట్ల మార్క్ చేరువలో ఉన్న రయీస్
  • ఐనా ఆమిర్, సల్మాన్ ఖాన్ ల కంటే రేసులో వెనుకబడ్డ షారుఖ్
shah rukh raees getting good collections

రీసెంట్ గా రిలీజైన షారుఖ్ ఖాన్ చిత్రం రాయిస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. పొగడ్తలతో పాటు కాసులు కూడా బాగానే రాలుతున్నాయి రయీస్ చిత్రానికి.  షారుఖ్ నటించిన రయీస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది . మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే 56 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి భారీ విజయం దిశగా దూసుకు పోతోంది . షారుఖ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన రయీస్ చిత్రానికి నెగెటివ్ రిపోర్ట్ లు వచ్చాయి కానీ వాటికీ భిన్నంగా వసూళ్లు వస్తుండటం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది .

 

అయితే భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ ల లాగా ఆ స్థాయిలో మాత్రం వసూళ్లు సాధించలేక పోతున్నాడు షారుఖ్ ఖాన్. సల్మాన్ , అమీర్ లు కేవలం రెండు, మూడు రోజుల్లోనే వంద కోట్ల ని రాబట్టగలరు కానీ షారుఖ్ ఇప్పుడు రాయిస్ తో వంద కోట్లు రాబట్టాలంటే కనీసం 5 రోజులు పట్టేలా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 56 కోట్లు మాత్రమే వసూల్ అయ్యింది. మొత్తానికి ఆ ఇద్దరు హీరోల కంటే కాస్త వెనుక బడ్డాడు షారుఖ్ . 

Follow Us:
Download App:
  • android
  • ios