మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మరో అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. షారూఖ్‌ ఖాన్‌ వంటి స్టార్లని వెనక్కి నెట్టి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌.. మరో ఘనతని సాధించారు. ఆయన ఏకంగా షారూఖ్ ఖాన్‌ని బీట్‌ చేశాడు. ఆయన్ని దాటి దూసుకుపోతున్నారు. ఏకంగా అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే రామచరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికిగానూ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు, క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో అంతర్జాతీయ పురస్కారాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొనె వంటి వారిని దాటుకుని ఆయన అంతర్జాతీయ అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం. 

తాజాగా రామ్‌ చరణ్‌ పాప్‌ గోల్డెన్‌ అవార్డు 2023 కి సంబంధించి గోల్డెన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ విజేతగా నిలిచారు. అత్యంత ప్రశంసలు అందుకున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని నటుడిగా విశేష ప్రశంసలు అందుకున్నారు. నటుడిగా, ఫ్యామిలీ పర్సన్‌గా, వ్యవస్థాపకుడిగా, బహుముఖ పాత్రలతో ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆయన ఏడాదంతా చర్చనీయాంశంగా మారారు. దీంతో తనతో పోటీ పడిన షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొనె, ఆదా శర్మ, రాశీఖన్నా వంటి వారితో పోటీ పడి మరీ ఆయన ఈ అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం. 

ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌కి మరో అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల ఆయన అభిమానులు హ్యాపీ అవుతున్నారు. ప్రశంసలు తెలియజేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. కింగ్‌ ఎప్పటికీ కింగే అంటున్నారు. ఇక ప్రస్తుతం రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది.