సిగ్గులేదా? నువ్వు ముస్లిం అనే విషయం మర్చిపోకు.. షారుఖ్ కూతురిపై ఫైర్

Shah Rukh Khan's Daughter Suhana Khan Gets Trolled for Bikini Pic
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానాఖాన్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే సుహానా తాజాగా ఓ బికినీ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఆమెకు తెచ్చిపెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానాఖాన్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే సుహానా తాజాగా ఓ బికినీ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఆమెకు తెచ్చిపెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నెటిజన్లు ఆమెపై ఘాటైన విమర్శలు చేస్తూ తిట్టిపోస్తున్నారు. షారుఖ్ కుటుంబం యూరప్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా బీచ్ కు వెళ్లిన సుహానా అక్కడ బికినీ తీసుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్త హాట్ గా ఉండడంతో.. ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. 'నువ్వు ముస్లిం అనే విషయాన్ని మర్చిపోవద్దు.. నీకు సిగ్గు లేదా..? ఇది నీ ప్రైవసీ కావచ్చు కానీ అందరూ చూసే విధంగా ఫోటోలు ఎందుకు పెట్టడం. మీ తండ్రి అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. నువ్వు సంప్రదాయాలను ఉల్లఘించి ఆయన పరువు తీయొద్దు' అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఆమెపై విరుచుకుపడ్డారు.

మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. 'బీచ్ కు వెళ్లి బుర్ఖా వేసుకోవాలా..?' అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఎప్పటిలానే ఈ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు సుహానా. షారుఖ్ ఖాన్ కూడా ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. 
 

 

My hotty babeis 🔥❤

A post shared by suhana khan (@suhanakha2) on Jul 4, 2018 at 5:53am PDT

loader