Asianet News TeluguAsianet News Telugu

క్లాసిక్‌ `దేవదాస్‌`కి 19ఏళ్లుః ధోతి ఊడిపోవడం పెద్ద సమస్య అయ్యిందంటోన్న షారూఖ్‌..

`దేవదాస్‌` బాలీవుడ్‌ చిత్ర సీమనే కాదు, యావత్‌ ఇండియన్‌ సినిమాపై ప్రభావాన్ని చూపించిన క్లాసికల్‌ చిత్రం. ఈ సినిమా విడుదలై(జులై 12) సోమవారంతో 19ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాని గుర్తు చేసుకుంది యూనిట్‌.

shah rukh khan remember his classic movie devdas completed 19 years  arj
Author
Hyderabad, First Published Jul 13, 2021, 10:03 AM IST

`దేవదాస్‌`.. హిందీలో ఓ క్లాసికల్‌ చిత్రం. బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కెరీర్‌లో ఓ మైలురాయి లాంటి చిత్రం. అద్భుతమైన కళాఖండాల సృష్టికర్త సంజయ్‌ లీలా భన్సాలీ నుంచి జాలువారి మరో అద్బుతమైన కళాఖండం. బాలీవుడ్‌ చిత్ర సీమనే కాదు, యావత్‌ ఇండియన్‌ సినిమాపై ప్రభావాన్ని చూపించిన క్లాసికల్‌ చిత్రం. ఈ సినిమా విడుదలై(జులై 12) సోమవారంతో 19ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాని గుర్తు చేసుకుంది యూనిట్‌. షారూఖ్‌ మాత్రం ఆ చిత్ర షూటింగ్‌ టైమ్‌లోనే ఓ ఫన్సీ సీన్‌ని వెల్లడించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. 

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో షారూఖ్‌ ఖాన్‌ హీరోగా, ఐశ్వర్యా రాయ్‌, మాధురీ దీక్షిత్‌ హీరోయిన్లుగా, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. 2002 జులై 12న ఈ ఎపిక్‌ రొమాంటిక్‌ డ్రామా విడుదలై సంచలన విజయం సాధించింది. యాభై కోట్లతో తెరకెక్కి దాదాపు వంద కోట్లు వసూలు చేసింది. ఐదు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకుని రికార్డ్ సృష్టించింది. అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది. 

పారూ- దేవదాస్‌ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్‌, మాధురీదీక్షిత్‌(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్‌ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్‌ బెస్ట్‌ పర్ఫామెన్స్‌లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలై 19ఏళ్లు అవుతున్న సందర్బంగా షారూఖ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. అప్పటి షూటింగ్‌ ఫోటోలను పంచుకుంటూ ఆ సీన్లని గుర్తు చేసుకున్నారు. 

అర్ధరాత్రి, తెల్లవారు జాము సమయాల్లో షూటింగ్‌ చేశామని, చాలా కష్టాలు పడ్డామన్నారు. మాధురి దీక్షిత్‌, ఐశ్వర్య రాయ్‌, జాకీ ష్రాఫ్‌ సహకారం వల్ల అది ఇబ్బందిగా అనిపించలేదన్నారు. చిత్ర బృందం, దర్శకుడు సంజయ్‌.. ఇలా అంతా ఓకే కానీ ధోతీ ఊడిపోవడం పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో పాత్రకి తగ్గట్టు షారుఖ్‌ ధోతీ ధరించేవారు. చిత్రీకరణ సమయంలో అది జారిపోతూ ఉండేదట.  మాధురీ దీక్షిత్‌ సైతం.. `19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్‌` అని సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios